Power Star: ఓజి కోసం సుజిత్ ప్లానింగ్ అదుర్స్ – ఫ్యాన్స్ కి పూనకాలే..!

రాజకీయాల నుండి గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తన కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి నాలుగు సినిమాలకు డేట్స్ కేటాయించాడు పవర్ స్టార్. చాలా కాలం కిందట మొదలైన హరిహర వీరమల్లు సినిమాను పక్కన పెట్టిన పవన్ సుజిత్ డైరెక్షన్లో రానున్న ఓజీ మీదనే ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ఆ మధ్య విడుదలైన గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలను పెంచుతోంది.ఇదిలా ఉండగా ఇప్పటికే ఓజి విషయంలో లీక్ అయిన ఫోటోలు, స్టోరీ లైన్ సినిమాకు హైప్ క్రియేట్ చేయగా తాజాగా వినిపిస్తున్న మరో వార్త ఆ హైప్ అమాంతం పెంచేస్తోంది.

డైరెక్టర్ సుజిత్ ఈ సినిమా కోసం 1950ల కాలం నాటి కథ సిద్ధం చేశాడని, పవన్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని ఆయన స్టైల్ కి తగినట్టు ఈ పీరియాడిక్ డ్రామా ఉండనుందని టాక్ వినిపిస్తోంది. సాహో సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ తో ప్రశంశలు అందుకున్న సుజిత్ ఈ కథలో మార్షల్ ఆర్ట్స్ బ్యాక్డ్రాప్ లో యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసాడని వార్తలొచ్చిన నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్లు  పూర్తి చేసుకోగా, హైదరాబాద్ లో త్వరలో జరగబోయే నాలుగో షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. మాఫియా బ్యాక్డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు