Bhola Shankar: అసలే రీమేక్ – ఆపై ఏజెంట్ ఎఫెక్ట్ – భోళా గట్టెక్కేనా..?

మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ డైరెక్షన్లో తమిళ సినిమా వేదాళం కి రీమేక్ గా రూపొందుతున్న భోళాశంకర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 11న రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, కీర్తి సురేష్ చెల్లెలి పాత్రలో నటిస్తోంది. అయితే, వరుస డిజాస్టర్స్ అందుకొని డైరెక్షన్ కి చాలా కాలంగా దూరంగా ఉన్న మెహర్ రమేష్ కి చిరంజీవి ఛాన్స్ ఇవ్వటం, పైగా ఈ సినిమా రీమేక్ అవ్వటంతో సినిమాపై ఫ్యాన్స్ కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదనే చెప్పాలి. దీనికి తోడు ఈ సినిమాకు సంబంధించి ఇటీవల వచ్చిన ఏ ఒక్క అప్డేట్ కూడా మెగాస్టార్ రేంజ్ కి తగ్గ హైప్ క్రియేట్ చేయలేకపోయాయి

ఇదిలా ఉండగా, ఈ సినిమా విషయంలో తాజాగా వినిపిస్తున్న ఓ వార్త ఫ్యాన్స్ నీ ఆందోళనకు గురి చేస్తోంది. అదేంటంటే, నిర్మాత అనీల్ సుంకర రీసెంట్ గా ఏజెంట్ సినిమాతో వచ్చిన నష్టాలను భోళాశంకర్ సినిమా ద్వారా రికవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇందుకు గాను ఏజెంట్ బయ్యర్లకు తక్కువ రేట్ కి భోళాశంకర్ రైట్స్ ని ఇస్తున్నారట.

ఈ నేపథ్యంలో అసలే హైప్ లేని ఈ సినిమాకు బిజినెస్ కూడా తక్కువ రేంజ్ లో చేస్తుండటంతో మెగా అభిమానులు నిరాశకు గురవుతున్నారు. మరి, వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి ఈ సినిమాతో కూడా హిట్ కొట్టి ఏజెంట్ ద్వారా తీవ్రంగా నష్టపోయిన నిర్మాత అనిల్ సుంకరని గట్టెక్కిస్తాడా లేదా అన్నది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు