Payal Rajput: అందం చూపించి రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ… ఇది తప్ప వేరే దారి దొరకట్లేదా?

ఆర్ఎక్స్100 సినిమాతో తెలుగు తెరకి హీరోయిన్ గా పరిచమైన పాయల్ రాజపుత్ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సాధారణంగా మొదటి సినిమాలో ఏ హీరోయిన్ అయిన ఎక్స్ పోజింగ్ చేయడానికి ముందు వెనక ఆలోచిస్తుంది. కానీ పాయల్ మాత్రం అలాంటి హద్దులేమి పెట్టుకోకుండా ఆర్ఎక్స్100 సినిమాలో ఎక్స్ పోజింగ్ మరియు రొమాంటిక్ సీన్స్ తో రెచ్చిపోయింది

అయితే పాయల్ రాజపుత్ కి ఆర్ఎక్స్100 తెలుగులో మొదటి సినిమానే కానీ అంతకు ముందు ఈ బ్యూటీ పంజాబీ మరియు హిందీ భాషలో పలు చిత్రాల్లో నటించింది. కానీ ఆ సినిమాల వల్ల పాయల్ కి ఎలాంటి గుర్తింపు లభించలేదు. దాంతో పాయల్ ఆర్ఎక్స్100 సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ సినిమా కాస్త బోల్డ్ సినిమా అవడంతో ఇక ఎక్స్ పోజింగ్ మరియు రొమాంటిక్ సీన్స్ లో నటించడం తప్పలేదు.

2018 లో రిలీజైన ఆర్ఎక్స్100 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించటంతో పాయల్ కి తెలుగులో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత కొన్ని చిన్న సినిమాలతో పాటు, రవి తేజ హీరోగా వచ్చిన డిస్కో రాజా, నాగ చైతన్య, వెంకటేష్ కలిసి నటించిన వెంకీ మామ లాంటి పెద్ద సినిమాలలోనూ నటించింది. కానీ ఈ సినిమాలేవీ పెద్దగా ఆడకపోవడంతో ఈ హాట్ బ్యూటీ కెరీర్ కి కాస్త బ్రేక్ వచ్చింది.

- Advertisement -

ప్రస్తుతం ఈ బ్యూటీ మాయాపేటిక అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి సయోనార అనే పాటని చిత్ర యూనిట్ విడదల చేసారు. అయితే ఈ సాంగ్ లో కూడా పాయల్ తన అందంతో రెచ్చిపొయినట్టుగా తెల్సుతోంది.విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ సినిమాతో పాటు పాయల్ రాజపుత్ ఆర్ఎక్స్100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతితో దర్శకత్వంలో మంగళవారం అనే సినిమా చేస్తుంది. మరీ ఈ రెండు సినిమాలతోనైనా ఈ బ్యూటీ ఫెయిట్ మారుతుందో లేదో చూడలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు