Hidimba: నందితకు ఎవ్వరు ఇవ్వని హిట్టు ఈ హీరో ఇస్తాడా?

కన్నడ బ్యూటీ నందిత శ్వేతా హీరోయిన్ గా తెలుగులో బ్రేక్ కోసం ఇప్పటికి ఎదురుచూస్తూనే ఉంది. అప్పుడెప్పుడో 2016 లో “ఎక్కడికి పోతావు చిన్నవాడా” సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ హీరోయిన్ మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ ఈ హీరోయిన్ కి క్రెడిట్ ఎక్కువగా రాలేదు. ఎందుకంటే అందులో ముగ్గురు హీరోయిన్లలో ఒకరు కాబట్టి. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని తెలుగులో వరుస సినిమాలు చేసింది. శ్రీనివాస కళ్యాణం, బ్లఫ్ మాస్టర్, కపటధారి లాంటి సీనిమాల్లో మంచి పాత్రలు చేసినా ఏ ఒక్క సినిమా హిట్టు కాలేదు.

ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అశ్విన్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం హిడింబ లో మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కగా హీరో, హీరోయిన్లిద్దరూ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. అయితే ఈ సినిమాకు అంతగా ప్రమోషన్లు మాత్రం జరగడం లేదు. కేవలం మౌత్ టాక్ మీద డిపెండ్ అవబోతుంది.

ఇక ఈ సినిమాను అనీల్ కన్నెగంటి డైరెక్ట్ చేయగా, SVK బ్యానర్ లో శ్రీధర్ గణపట్నం నిర్మించాడు. ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వని “హిడింబ”ని జులై లో విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో హీరోయిన్ గా మంచి హిట్ కొట్టి టాలీవుడ్ లో పాగా వేయాలని కలలుగంటుంది నందిత శ్వేత. అందుకే ఈ చిత్ర ప్రమోషన్లో కుడా అన్ని చోట్ల పాల్గొంటుంది. అటు హీరో అశ్విన్ బాబు కి కూడా ఈ సినిమా హిట్టు కావడం చాలా అవసరం. రాజుగారిగది మినహా వేరే హిట్ లేని ఈ హీరో ఈ సినిమాతో హిట్టు కొడతాడా? హీరోయిన్ గా నందితా శ్వేతకు మంచి హిట్ ఇచ్చి బ్రేక్ ఇవ్వగలడా? అన్నది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు