అడివి శేష్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా ఈ చిత్రం తెరకెక్కింది తెలుగుతో పాటు హిందీ, మలయాళం భాషల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కాబోతుంది.
ఈ క్రమంలో మేజర్ చిత్రంలో ఓ హీరోయిన్ గా నటించిన నటి శోభితా ధూళిపాళ ప్రమోషన్లలో పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా ఆమె మహేష్ బాబు గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Read More: Nene vasthunna: విడుదల తేదీ ఖరారు
ఆమె మాట్లాడుతూ…” మహేష్ బాబు గారి కెరీర్ ప్లానింగ్ అద్భుతంగా ఉంటుంది. తన జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్ లో మొదటిసారి ఆయన బయట సినిమాని నిర్మిస్తున్నారు. ఇది మాలో గొప్ప ఎనర్జీ నింపింది. కరోనా సమయంలో చాలా అందోళన పడ్డాం.ఈ సినిమా ఓటీటీకి వెళ్ళిపోతుందేమోనని భయపడ్డాం.
కానీ మహేష్ బాబు గారు మాకు బ్యాక్ బోన్ గా నిలబడ్డారు. ‘ఇది థియేటర్ సినిమా ..ఎట్టి పరిస్థితిలో థియేటర్లోనే విడుదలౌతుందని’ చెప్పారు. ఆయన మార్గదర్శకం, ప్రోత్సాహం మాలో గొప్ప నమ్మకాన్ని నింపింది. మంచి నిర్మాణ సంస్థలో పని చేశాననే ఆనందం మాకు ఉంది ” అంటూ చెప్పుకొచ్చింది.
Read More: Hrithik roshan : క్రిష్4 కి లైన్ క్లియర్
హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌదరి మనవడు,...
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...