రాజశేఖర్ హీరోగా జీవిత దర్శకత్వంలో తెరకెక్కిన శేఖర్ సినిమాపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ ”నేను శేఖర్ చిత్రానికి నిర్మాతను. జీవితా రాజశేఖర్ గారు మా చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజశేఖర్ గారు హీరోగా నటించారు. వాళ్లిద్దరికీ పారితోషికాలు పూర్తిగా చెల్లించాను. ఈ సినిమా రాజశేఖర్, జీవిత గార్లది అనుకుని ఎవరో కోర్టుకు వెళ్లారు.
నా సినిమాకు వాళ్ళు నష్టం కలిగిస్తే…నా సినిమాకి ఏదైనా జరిగితే… నేను పరువు నష్టం దావా కేసు వేస్తా. నేను నష్టపోయిన మొత్తాన్ని వాళ్ళ నుండే రాబడతా. నా సినిమాను ఎవరికీ అమ్మకూడదని ఏదో చెబుతున్నారు. అది చెల్లదు. ఎందుకంటే… అసలు నిర్మాతను నేను” అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
శేఖర్ చిత్రం నిర్మాతల పై రిలీజ్ కు ముందు కొన్ని ఆరోపణలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. జీవిత రాజశేఖర్ డబ్బు తీసుకుని ఎగ్గొట్టారని ఆరోపిస్తూ ఓ పెద్ద వ్యక్తి మీడియా ముఖంగా తెలియజేశారు.