సినిమాలు హిట్ అవడం హీరోయిన్స్ కు చాలా అవసరం. ఒక్క సినిమా ప్లాప్ అయినా, కెరీర్ పైనే దెబ్బపడే అవకాశం ఉంటుంది. చిన్న హీరోయిన్లకు అయినా, పెద్ద హీరోయిన్లకు అయినా ఇదే వర్తిస్తుంది. ఇప్పటికే పలువురు హీరోయిన్లు తమ సినిమాలు ప్లాప్ కావడంతో ఛాన్స్ లు రాక, యాక్టింగ్ కెరీర్ నే ముగించేశారు. ప్రస్తుతం టాలీవుడ్ లో తమన్నా, మెహ్రీన్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
మిల్కీ బ్యూటీ తమన్నా, టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. కానీ ఈ భామ ప్రస్తుతం ఇండస్ట్రీలో గడ్డుకాలాన్ని అనుభవిస్తుంది. ఎఫ్ 2 మంచి హిట్ అందుకున్నా తర్వాత తమన్నా నుండి చెప్పుకొదగ్గ హిట్స్ సినిమాలు రాలేదు. అవకాశాలు అంతంత మాత్రమే. దీంతో ’’మాస్ట్రో’’ మూవీతో విలన్ పాత్రలు చేయడానికీ రెడీ అయిపోయింది ఈ భామ. అంతే కాకుండా ఈ మిల్కీ బ్యూటీ ఐటెం సాంగ్స్ చేయడానికీ సై అంటుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ’’గని’’ మూవీలో స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే.
మెహ్రీన్ కు కూడా ఎఫ్2 తర్వాత వరుసగా అన్ని సినిమాలు నిరాశపర్చాయి. ఈ ఇద్దరికి తెలుగులో సినిమా అవకాశాలు తక్కువగానే వస్తున్నాయి. తమిళంలో కొంత వరకు ఛాన్స్ లు వస్తున్నా, అక్కడ కూడా నిరాశే మిగులుతుంది.
ప్రస్తుతం తమన్నా, మెహ్రీన్ ఎఫ్3లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి భామలకు ఈ మూవీ చాలా కీలకంగా మారింది. ఈ మూవీపై ఆశలన్నీ పెట్టుకుని, రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ మూవీతో అయినా తమన్నా, మెహ్రీన్ పూర్వ వైభవం తెచ్చుకుంటారా, లేదా అంటే మరి కొద్ది రోజులు వెచి చూడాలి. కాగా, ఎఫ్ 3 ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లోకి వస్తుంది.