Mega Family : వరుణ్ తేజ్ తో పెళ్లిపై లావణ్య త్రిపాఠి రియాక్షన్

గతకొద్ది రోజులుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ప్రేమించుకుంటున్నారని, పెళ్లి గురించి ఇదిగో ఎనౌన్స్ మెంట్.. అదిగో ఎనౌన్స్ మెంట్.. అని అందరు అంటున్న కూడా అఫీషియల్ గా మాత్రం ఈ న్యూస్ పై మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు స్పందించటం లేదు.

అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచమైన లావణ్య త్రిపాఠి, దాదాపు టాలీవుడ్ లో ఉన్న అందరు యంగ్ హీరోలతో సినిమాలు చేసింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ సినిమాలో కలిసి నటించిన వరుణ్ తేజ్ మరియు లావణ్య, ఆ షూటింగ్ సమయంలోనే ప్రేమించుకున్నరట. కొద్దిరోజులు ఈ ప్రేమ వ్యవహారం నడిచాక, పెళ్లి చేసుకుందాం అనే నిర్ణయానికి వచ్చరంట. అయితే అప్పుడు వరుణ్ తేజ్ చేసిన వరుస సినిమాలు ఫ్లాప్ ఆవుతుండంతో కొద్దీ రోజులు పెళ్లిని వాయిదా వేసుకున్నారట. ఆ తరువాత సినిమాలలో బిజీ అయిపోయిన వీళ్లిద్దరు.. ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లిట్ అయ్యాక పెళ్లి గురించి ఆలోచిద్దాం అనుకున్నారట.

అయితే  ఈ పెళ్లి గురించి జనాలు మాట్లాడుకోవటమే కానీ వరుణ్ గాని లావణ్య గాని ఈ న్యూస్ పై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. గతంలో లావణ్య త్రిపాఠిపై ఒక వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయగా, వెంటనే రెస్పాండ్ అయిన లావణ్య.. ఈ న్యూస్ పై మాత్రం ఏ విధంగానూ స్పందించకపోవటం అనుమానాల్ని రేకెత్తిస్తుంది. వరుణ్ తేజ్ అంటే కాస్తా సోషల్ మీడియాకి దూరంగా ఉంటాడు కానీ లావణ్య మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. ఈ పెళ్లి న్యూస్ వచ్చినప్పటి నుంచి కూడా ఆమె ఎక్కువ సమయం జిమ్ లోనే గడుపుతూ పోస్ట్ లు పెడుతుంది. కామెంట్స్ లో అందరు పెళ్లి గురించి అడుగుతున్న కూడా లావణ్య పట్టించుకోకుండా తన పనేదో తాను చేసుకుంటూపోతుంది. దాంతో వీరిద్దరిపై వచ్చిన ఈ వార్తలు నిజమో కాదో అనే అనుమానంలో పడిపోయారు అందరు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు