Krishna Vrinda Vihari: ట్రైలర్ రిలీజ్

ఫలితం ఎలా ఉన్నా విభిన్న కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు నాగశౌర్య. కెరీర్ ఆరంభం నుండి కథల ఎంపికలో వేరియేషన్ చూపిస్తూ టాలీవుడ్ లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నాగశౌర్య ఎంచుకునే సినిమాలు ఆడియన్స్ ను మెప్పించే విధంగా ఉంటాయని చాలామంది భావిస్తారు. అందుకే కథల విషయంలో ఈ హీరో చాలా జాగ్రత్తగా వెళుతుంటాడు. తాజాగా “కృష్ణ వ్రింద విహారి” అనే ప్యూర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై నిర్మితమైన ఈ సినిమాకి అనీష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో షిర్లే సెటియా కథానాయకగా పరిచయం అవుతుంది. మహాతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు.

ఇంతవరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ మూవీ పై ఆసక్తిని పెంచుతూ వెళ్లాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యాంతం ఎంటర్టైనింగ్ గా ఉండడంతో ప్రేక్షకులను ఇది బాగా అలరిస్తోంది. ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయి ఉద్యోగం రీత్యా పట్టణానికి వచ్చి ఒక అమ్మాయిని ప్రేమించడంతో అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు అనేది ఈ సినిమా కధగా ఉండబోతున్నట్లు ట్రైలర్ లో తెలుస్తోంది. ఇక నాగశౌర్య మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. వెన్నెల కిషోర్, సత్య కామెడీ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాధిక కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా ఈనెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు