Dasara: ఇంట్లో మనశ్శాంతి లేదు… కీర్తి సురేష్ లవ్ ఎఫైర్లపై ఆమె తండ్రి సంచలన వ్యాఖ్యలు

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లపై రూమర్స్ రావడం అనేది సర్వ సాధారణంగా జరుగుతూ ఉండేదే. దీనికి స్టార్ హీరోయిన్లు, చిన్న హీరోయిన్లు అంటూ తేడా ఉండదు. ఒకరితో కాస్త సన్నిహితంగా కనిపిస్తే చాలు.. నెటిజన్లు ఆ వ్యక్తితో సదరు హీరోయిన్ డేటింగ్ చేస్తుందని..ఒకే రూంలో ఉంటున్నారంటూ.. పిచ్చి పిచ్చి రాతలు రాసేస్తారు. ఇలాంటి రాతల వల్ల హీరోయిన్ల పర్సనల్ లైఫ్ ఎలా మారుతుందని ఏ మాత్రం ఆలోచించకుండా, తమ క్రియేటివిటీకి పని చెప్పి హీరోయిన్లకు కొత్త తలనొప్పులు తెస్తారు.

ఈ సమస్య ప్రస్తుతం టాలీవుడ్ మహానటి, ఇటీవల దసరా సినిమాలో వెన్నెల పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కీర్తి సురేష్ ఇంట్లో కూడా తలెత్తింది. ఇటీవల కీర్తి సురేష్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. ఇందులో కీర్తిసురేష్ ఒక అబ్బాయితో కాస్త క్లోజ్ గా కనిపించింది. దాంతో నెటిజన్లు తమ పెన్నుకు పని చెప్పి… ఆ వ్యక్తికి కీర్తి సురేష్ కు సంబంధాన్ని అంటగట్టేశారు. ఇది చిలికి చిలికి గాలి వానలా తయారైంది. దీంతో మహానటి స్పందించక తప్పలేదు. తనకు లవర్ అంటూ ఎవరూ లేరని, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి తనకు మంచి ఫ్రెండ్ అని, అతని పేరు ఫర్హాన్ అని క్లారిటీ ఇచ్చింది. అయిన కూడా ఈ రూమర్స్ కు బ్రేక్ పడలేదు.

దీంతో తాజాగా ఆమె తండ్రి స్పందించారు. తన కూతురు కీర్తి సురేష్ ప్రస్తుతం లవ్ లో లేదని స్వయంగా కీర్తి సురేష్ తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్ చెప్పాల్సి వచ్చింది. ఓ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలపై అసభ్యకరమైన కామెంట్స్ విని బాధ అనిపించిదని చెప్పారు. ఆ ఫోటోపై వచ్చింది అంతా కూడా తప్పుడు ప్రచారమే అని క్లారిటీ ఇచ్చారు. కీర్తి సురేష్ లవ్, పెళ్లి ఉంటే తమే అధికారికంగా చెబుతామని స్పష్టం చేశారు. కానీ, ఇలా తప్పుడు ప్రచారం చేయ్యొద్దని కోరారు. ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల తమ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయిదని నిర్మాత సురేష్ చెప్పుకొచ్చారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు