Kasthuri Shankar: పేరుకే పెద్ద సినిమా.. కానీ దానికి ఒప్పుకోవాల్సిందే..?

Kasthuri Shankar.. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా నీకు అవకాశం ఇస్తే.. నాకేంటి? అనే రసికరాజులు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగానే ఉన్నారు. సినీ నేపద్యం వల్ల కుటుంబం నుంచి వచ్చిన సెలబ్రిటీలకు ఇటువంటి ఇబ్బందులు ఎదురవ్వకపోవచ్చు .. కానీ కొత్తగా ఇండస్ట్రీలో సక్సెస్ కావాలి అనుకునే వారికి మాత్రం ఇలాంటి సమస్యలు ఎన్నో.. అన్నీ వదులుకొని సినీ ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ కావాలనుకునే వారికి ఇలాంటి సమస్యలు ఎదురైతే కొంతమంది ఒళ్ళు సమర్పించలేక ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోతారు.. మరికొంతమంది తప్పని పరిస్థితిలో లొంగిపోయిన వారు కూడా ఉన్నారు. అయితే మరికొంతమంది ఇలాంటివి ఎదిరించి అగ్రస్థానంలో నిలిచిన హీరోయిన్లు కూడా ఉన్నారు. మరికొంతమంది అన్ని విధాలుగా వాడుకొని వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు.. ఇలా ఇండస్ట్రీలో రకరకాల వ్యక్తులు మనకు కనిపిస్తూనే ఉంటారు.. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎప్పటినుంచో ఉంది కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీటూ ఉద్యమం పేరిట చాలామంది సెలబ్రిటీలు తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ఒక్కొక్కరిగా బయట పెడుతూ.. తాము ఎవరి వల్ల ఇబ్బంది పడ్డాము అన్న విషయాలను కూడా మీడియాతో ధైర్యంగా పంచుకుంటున్నారు ..ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకొని అప్పుడప్పుడు విమర్శలకు కూడా గురైన ప్రముఖ హీరోయిన్ కస్తూరి శంకర్ కూడా ఈ విషయంపై స్పందించి అందరిని ఆశ్చర్యపరిచింది..

Kasthuri Shankar:The name is a big movie.. but do you have to agree to it..?
Kasthuri Shankar:The name is a big movie.. but do you have to agree to it..?

క్యాస్టింగ్ కౌచ్ పై కస్తూరి కామెంట్..

హీరోయిన్ గా అన్నమయ్య సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.. కానీ ఏమైందో తెలియదు కానీ సినీ ఇండస్ట్రీకి దూరమై ఇప్పుడు సీరియల్స్ చేస్తూ ఇక్కడే సెటిల్ అయిపోయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కస్తూరి శంకర్ మాట్లాడుతూ.. మీ టు ఎక్స్పీరియన్స్ నాకు చాలాసార్లు ఎదురయింది ..దానిపై నేను మాట్లాడను.. వాటికి ఒప్పుకోలేదని నన్ను చాలా సినిమాల నుంచి తీసేసారు.. అలాగే ఎన్నో సీరియల్ ఎపిసోడ్స్ కూడా లేపేశారు. ముఖ్యంగా తెలుగులో ఇలాంటి అనుభవం నాకు ఎదురు కాలేదు కానీ తమిళ్, మలయాళం ఇండస్ట్రీలలో మరింత వరస్ట్ గా అనిపిస్తుంది.

ఆ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువ..

ముఖ్యంగా మలయాళం సినిమాలో మరీ వరస్ట్ ఎక్స్పీరియన్స్ ను నేను అనుభవించాను.. ముఖ్యంగా మలయాళం ఇండస్ట్రీ నుంచి బయటకు రావడం నాకు చాలా అదృష్టంగా అనిపించింది.. అయితే ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ చాలా బాగుంది.. కానీ అప్పుడు ఆ అనుభవం వల్ల మళ్ళీ నేను మలయాళం ఇండస్ట్రీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు అంటూ కస్తూరి శంకర్ తెలిపింది.. మలయాళం సినిమా ఇండస్ట్రీలో పెళ్లయిన తర్వాత నేను కం బ్యాక్ ఇచ్చాను.. అది చాలా పెద్ద ప్రాజెక్టు… అయితే ఆ ప్రాజెక్ట్ లో ఒప్పుకోలేదని తీసేసారు.. అన్నిచోట్ల అన్నీ ఉంటాయి.. ముఖ్యంగా బిల్డింగ్ కడుతుంటే మేస్త్రికి వర్కర్ కి మధ్య ఎఫైర్లు ఉంటాయి.. ఎక్కడైనా ఇది సహజము.. అలాగని అందరూ అలా ఉంటారని చెప్పలేను.. ముఖ్యంగా లంచం తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు.. ఇది కూడా అంతే.. అందరిని ఒకే దృష్టితో చూడలేము కదా.. ఇక మలయాళం ఇండస్ట్రీలో నాకు ఎదురైన చేదు అనుభవాన్ని అన్ని ఇండస్ట్రీలతో పోల్చి చెప్పలేను.. పేరుకే పెద్ద ప్రాజెక్టులు కమిట్మెంట్ కి ఒప్పుకోకపోతే క్షణం ఆలోచించకుండా ఎటువంటి వారినైనా తీసేస్తారు అంటే అసలు విషయాన్నీ చెప్పుకొచ్చింది కస్తూరి శంకర్.. ప్రస్తుతం కస్తూరి శంకర్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో మారుతున్నాయి.. అయితే ఆమె మలయాళం ఇండస్ట్రీ గురించి మాట్లాడింది.. కానీ అక్కడ ఏ సినిమా? ఎవరు ఈమెను క్యాస్టింగ్ కౌచ్ కి గురి చేశారు? అన్న మాత్రం బయట పెట్టలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు