Karthikeya-2: సందిగ్థంలో

ఆగస్టు 5న రిలీజైన సీతా రామం, బింబిసార సినిమాలకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఆడియన్స్ థియేటర్స్ కి తరలి వస్తున్నారు. ఈ రోజుల్లో ఒక సినిమా గట్టిగ వారం రోజులు ఆడటమే కష్టం అనుకున్న తరుణంలో రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి జోరును కొనసాగిస్తున్నాయి.
ఈ రెండు చిత్రాలకు రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు అంటే అది అతిశయోక్తి కాదు.

ఈ వారంలో మాచర్ల నియోజక వర్గం, కార్తికేయ-2 చిత్రాలతో పాటు, లాల్ సింగ్ చడ్డా సినిమా కూడా విడుదల కానుంది. కానీ సమస్య అంతా ఇక్కడే మొదలయింది. గతవారం రిలీజైన సినిమాలకు ఇప్పటికి మంచి కలక్షన్స్ వస్తున్నాయి. అంతే కాకుండా మహేష్ బాబు బర్త్ డే సంధర్బంగా గత రెండు రోజులు మహేష్ బాబు ఒక్కడు, పోకిరి చిత్రాలను పలు థియేటర్స్ లో ప్రదర్శించారు. మహేష్ మేనియా తరువాత ఇప్పుడు మళ్ళీ సీతా రామం , బింబిసార సినిమాలవైపు ఆడియన్స్ మొగ్గు చూపుతున్నారు. ఇంత విజయవంతగా సినిమాలు ఆడుతున్న తరుణంలో తమ సినిమాలకు థియేటర్స్ దొరుకుతాయో లేదో అని మాచర్ల నియోజక వర్గం, కార్తికేయ-2 చిత్ర బృందాలు ఆలోచనలో పడ్డారు.

మాచర్ల నియోజక వర్గం సినిమాకు ముందే థియేట‌ర్లు చాలా వ‌ర‌కు బుక్ అయ్యాయి. అత‌డి తండ్రి సుధాక‌ర్ రెడ్డికి మంచి ప‌లుకుబ‌డి కూడా ఉంది. కాబట్టి నితిన్ సినిమాకి స‌మ‌స్య కాక‌పోవ‌చ్చు. కానీ లేటుగా రేసులోకి వ‌చ్చి, మిగ‌తా రెండు చిత్రాల కంటే ఆల‌స్యంగా రిలీజ్ కానున్న కార్తికేయ‌-2 చిత్రబృందం ఏమి చేయాలో తెలియని సందిగ్థంలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా ప‌లుమార్లు వాయిదా ప‌డింది. థియేట‌ర్ల విష‌యంలోనూ ఇబ్బందులు త‌లెత్తాయి. ఏదేమైనా సినిమా రిలీజై మంచి ఫలితాన్ని సాధిస్తే కార్తికేయ- 2 నిర్మాతలు సేఫ్ జోన్ లో ఉన్నట్లే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు