Kajal Aggarwal : భారతీయుడు2 తోనే రీ ఎంట్రీ

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ అంటే అందిరికీ తెలుసు. లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కాజల్, కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో పాపులర్ అయ్యారు. చందమామ తర్వాత కాజల్ కెరీర్ మారిపోయింది. వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. కొన్ని రోజుల్లోనే టాప్ హీరోయిన్ అయిపోయింది. కెరీర్‌ మంచి ఫామ్‌లో ఉండగానే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది కాజల్.

పెళ్లి తర్వాత కాజల్ రీ ఎంట్రీ ఉంటుందా అనే ప్రశ్న చాలా రోజుల నుంచి వినబడుతుంది. పెళ్లి తర్వాత ఆచార్య, ఘోస్ట్ వంటి చిత్రాల నుంచి కాజల్ బయటకు వచ్చింది. దీంతో సినిమాలకు కాజల్ పూర్తిగా దూరమవుతుంది అనే ప్రచారం సాగింది. దీంతో పాటు కమల్ హాసన్ తో భారతీయుడు 2 సినిమాలో కూడా కాజల్ కు పెళ్లికి ముందే అవకాశం వచ్చింది. కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి కూడా కాజల్ తప్పుకుందని వార్తలు వినిపించాయి. త్వరలోనే మరో హీరోయిన్ డైరెక్టర్ శంకర్ ఎంపిక చేస్తాడని గుస గుసలు వినిపించాయి.

తాజాగా ఈ వార్తలకు కాజల్ బ్రేక్ వేసింది. తాను మళ్లీ సినిమాల్లో నటిస్తానని ఇన్ స్టాగ్రామ్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. శంకర్, కమల్ హాసన్ కాంబోలో వస్తున్న భారతీయుడు 2 లో నటిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 13 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించింది. తాను కూడా అప్పుడే సెట్స్ పైకి వెళ్తానని చెప్పింది. దీంతో కాజల్ రీ ఎంట్రీ తో పాటు భారతీయుడు 2 షూటింగ్ ప్రారంభం అవుతుందని రెండు విషయాల్లో అభిమానులకు క్లారిటీ వచ్చింది.

- Advertisement -

కాగా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం భారతీయుడు2. ఈ చిత్రం ఎప్పుడో ప్రారంభమైంది. దాదాపు 70 శాతం షూటింగ్ కూడా పూర్తి అయింది. కానీ, షూటింగ్ సెట్లో ప్రమాదం, ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్ శంకర్ కు మధ్య గొడవల కారణంతో ఆగిపోయింది. చాలా రోజుల తర్వాత మళ్లీ ఇప్పుడు షూటింగ్ జరగబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు