Rajasekhar : పవన్ తో సినిమా

సీనియర్ హీరో రాజశేఖర్ టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ హీరోగా చాలా రోజులు తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేశాడు. మధ్యలో కొంత గ్యాప్ తీసుకుని మహాంకాళి, గడ్డం గ్యాంగ్ వంటి చిత్రాలు చేశాడు. కానీ ఆ సినిమాలు దారుణంగా విఫలమైయ్యాయి. వరుస ఫ్లాపులతో ఉన్న రాజశేఖర్ ను గరుడ వేగ గట్టెక్కించింది. ఆ సినిమాతో రాజశేఖర్ లో కొత్త ఉత్సాహం వచ్చింది.

తనను పోలీసు పాత్రలో ఉంటేనే జనాలు చూస్తున్నారని భావించి, వరుసగా కల్కి, శేఖర్ సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలు కూడా పోలీస్ పాత్రల నేపథ్యంలోనే తెరకెక్కాయి. గతంలో రాజశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా మూడు సినిమాలను ప్రకటించాడు. అందులో శేఖర్ చిత్రం మాత్రమే బయటకు వచ్చింది. మరో రెండు చిత్రాల గురించి ఇప్పటి వరకు బయటకు రాలేదు.

అయితే తాజాగా ఒక సినిమా గురించి వార్తలు వినిపిస్తున్నాయి. యంగ్ డైరెక్టర్ పవన్ సాధినేనితో రాజశేఖర్ సినిమా చేస్తున్నాడని సమాచారం అందుతుంది. పవన్ సాధినేని నుంచి ఇంతకుముందు ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి తో పాటు ఇటీవల ఓటీటీలో సేనాపతి అనే సినిమా కూడా వచ్చింది. ఈ డైరెక్టర్ తో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ సినిమా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కథకు సంబంధించిన చర్చలు ముగిశాయని, త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని టాక్ వినిపిస్తుంది. కాగా ఈ సినిమాకు మార్కాపురం శివకుమార్ నిర్మాతగా వ్యవహరించనున్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు