Rajinikanth: టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం – డబ్బుకోసం మరి ఇంతగా దిగజారాలా

ఈ కాలంలో అందరిలోనూ డబ్బు కోసం ఎంతకైన దిగజారడమనేది సర్వ సాధారణం అయిపొయింది. అయితే కూటికి గతిలేని వాడు డబ్బు కోసం ఏదైనా చేసాడంటే అందులో అర్థం ఉంది కానీ కోట్లకి కోట్లు ఉన్న కూడా కొంత మంది మాత్రం ఇంకా, ఇంకా డబ్బు సంపాదించలనే తపనతో అడ్డదార్లు తొక్కుతున్నారు.

ఇక విషయానికొస్తే తాజాగా ఒక తెలుగు సినిమా ప్రొడ్యూసర్ ప్రస్తుతం అతనికి సినిమాలేవీ లేకపోవడంతో ఏదో విధంగా డబ్బు సంపాదించాలనే ఆశతో అడ్డదార్లు తొక్కి, ప్రస్తుతం జైల్లో ఊచలులెక్కపెడుతున్నారు. అయితే మరీ ఈ ప్రొడ్యూసర్ ఏమైనా చిన్న, చితక సినిమాలు తీసి నష్టపోయాయినవాడా అంటే అది కూడా కాదు. ఏకంగా సూపర్ స్టార్ రజని కాంత్ హీరోగా వచ్చిన కబాలి సినిమాని తెలుగులో రిలీజ్ చేసిన బడా బాబు.

పా. రంజిత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజని కాంత్ హీరోగా వచ్చిన కబాలి సినిమా గురించి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి కలైపులి ఎస్. థాను నిర్మాతగా వ్యవహరించగా, ఈ సినిమాని తెలుగులో కేపీ చౌదరి రిలీజ్ చేసాడు. ఈ సినిమా తరువాత నుంచి పలు పెద్ద సినిమాలకు ఫైనాన్సర్ గా చేస్తున్న ఈ నిర్మాత గోవాలో కొకైన్ సరఫరా చేస్తూ పోలీస్ లకు చిక్కాడు.

- Advertisement -

వివరాల్లోకి వెళ్తే ఇతనికి డ్రగ్ రాకెట్ తో సంబంధాలున్నాయని తేలడంతో పోలీస్ లు ఇతన్ని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు