Geetha arts : అయితే ఆహా కష్టాలు నిజమేనన్న మాటా.. ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చిన ఒరిగేదేముంది?

తెలుగులో మొదటి ఓటిటి ఫ్లాట్ ఫామ్ గా పిలవబడే ఆహా గురించి అందరికి తెలిసిందే. అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ కి అనుసంధానంగా ఈ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీని స్థాపించారు. తెలుగులో రీజినల్ కంటెంట్ ని ప్రెసెంట్ చేయడం మా ప్రధాన ఉద్దేశ్యం అని చెప్పుకునే ఆహా ఇప్పటివరకు అయితే చేసిందేమి లేదు.

ఆహాని స్టార్ట్ అయిన మొదట్లో చాలా మంది యంగ్ టాలెంటెడ్ వాళ్ళకి మరియు యూట్యూబర్స్ కి, ఆహా ద్వారా మంచి అవకాశాలు వస్తాయేమో అని చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ యాప్ లాంచ్ అయ్యి మూడు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటి వరకు ఆహా ద్వారా ప్రయోజనం పొందిన వాళ్ళు లేరనే చెప్పాలి. మలయాళం, తమిళ్, కన్నడ భాషల్లో వచ్చే సినిమాలని డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడం తప్ప కొత్తగా మాత్రం ఆహా కంటెంట్ క్రియేట్ చేయడం లేదు.

దాంతో ఆహాకి ఈ మధ్య చాలా నష్టాలు వచ్చాయి. ఈ నష్టాలు ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం ఆహాని అల్లు అరవింద్ గాని, అల్లు అర్జున్ గాని సరిగా పట్టించుకోకపోవటమే. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటం మూలాన ఆహా నిరుపయోగంగా మారింది. దాంతో ఈ విషయాన్నీ రియలైజ్ అయిన ఆహా టీం అల్లు అర్జున్ కి ఈ న్యూస్ చేరవేయగా, ప్రస్తుతం ఆహా బాధ్యతలన్నీ అల్లు అర్జున్ తీసుకున్నాడని టాక్.

- Advertisement -

ఇక నుంచి కంటిన్యూస్ గా కొత్త కంటెంట్ ని ప్రేక్షకులకి అందించడానికి సరికొత్త ప్రోగ్రామ్స్ ని, షోలను దాంతో పాటు సినిమాలను పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారట. ఇటీవలనే వీటిని తెలియజేస్తూ త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ ఒక యాడ్ కూడా షూట్ చేసారు. తొందర్లోనే ఈ యాడ్ ద్వారా ఆహా రాబోయే రోజుల్లో ప్లాన్ అఫ్ యాక్షన్ కి సంబంధించి విషయాలని తెలియజేయబోతుందంట. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో సినిమాలు తప్పకుండ చేయాలి. అదికాక అల్లు అర్జున్ నిర్మాణ బాధ్యతలు ఇప్పటివరకు చేపట్టింది లేదు. ఒకవేళ ఆహాన్ని డెవలప్ చేసే ఆలోచన అల్లు అర్జున్ కి ఉంటె, ఆ పని ముందే చేయవలసింది. ఆల్రెడీ నష్టాల్లో కూరుకుపోయిన ఆహాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ వచ్చిన ఒరిగేదిమి లేదని విశ్లేషకుల అభిప్రాయం.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు