Stalin: చిరు తర్వాత సినిమాలో త్రిష? ఇది నిజమేనా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి మరే ప్రాజెక్టును అనౌన్స్ చేయలేదు. వరుసగా కథలు మాత్రం వింటున్న చిరు ఈ సారి యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వనున్నాడని తెలుస్తుంది. అయితే గత కొన్నాళ్లుగా చిరంజీవి “సోగ్గాడే చిన్నినాయనా” ఫేమ్ కళ్యాణ్ కృష్ణ కథలు వింటున్నాడు. అందులో ఒక కథ బాగుందన్న చిరు ఆ స్క్రిప్ట్ లో పలు మార్పులు చేయమని చెప్పారు.

అంతే కాక “బింబిసార” తీసిన డైరెక్టర్ వశిష్ఠ తోనూ ఓ సినిమా తీయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ డైరెక్టర్ కూడా పలు కథలు చిరు కు వినిపించడం తో అందులో ఒక స్క్రిప్ట్ ఓకే అయినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం భోళా శంకర్ విడుదలయ్యే వరకు మరో సినిమా అనౌన్స్ చేయకూడదని ఫిక్స్ అయ్యారు చిరు. గతంలో జరిగిన పొరపాట్ల వలన డిజాస్టర్లు అందుకున్న చిరు ఇప్పుడు వరుస సినిమాలు కాకుండా వన్ బై వన్ ఒక సినిమా పూర్తి అయిన తర్వాతే మరో సినిమా చేయాలనీ చూస్తున్నాడు.

ఇదిలా ఉండగా చిరంజీవి రాబోయే సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ గతంలో స్టాలిన్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. 2006 లో వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ 17యేళ్ల తర్వాత వీళ్ళు కలిసి నటించబోతున్నారని న్యూస్ వైరల్ వైరల్ అవుతుంది. ఇదే నిజమైతే చిరు నిర్ణయం సరైందని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్నాళ్లుగా చిరంజీవి హీరోయిన్ల సెలెక్షన్లు సరిగ్గా చేయడం లేదన్నది వాస్తవం. తమన్నా, శృతి హాసన్ లాంటి హీరోయిన్లు చిరు కు అస్సలు సెట్ కాలేదు. వీరితో ఉన్న స్టిల్స్ రిలీజ్ అయినపుడు కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి.

- Advertisement -

ఇప్పుడు సీనియర్ హీరోయిన్ అయిన త్రిష తో అనౌన్స్ చేస్తే చాలా బాగుంటుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది నిజమో కాదో తెలియాలంటే ముందుగా చిరుతో తీసే దర్శకుడెవరో తెలియాలి. అది కళ్యాణ్ కృష్ణ కావచ్చు, లేదా వశిష్ఠ కావచ్చు లేక మరెవరైనా కావచ్చు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు