Apsara rani : ఆ ఐటెం భామ ఏడ్చింది..

చక్కనమ్మ చిక్కినా అందమే… అనేది పాత సామెత అందమైన ఐటెం భామ ఏడ్చినా అందమే అన్నది కొత్త సామెత అనెట్టట్టు ఉంది ఈ వార్త చూస్తే. టాలీవుడ్ లో ఐటెం గర్ల్స్ కు ఉన్న డిమాండ్ హీరోయిన్స్ కూడా లేదనేది ఎవరు కాదనలేని వాస్తవం. ఒక హీరోయిన్ సినిమా మొత్తానికి తీసుకునే రెమ్యునరేషన్, ఐటెం భామలు ఒక్క పాటకు మాత్రమే తీసుకుంటారు. ప్రేక్షకుల్లో కూడా ఐటెం సాంగ్ లకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. అయితే అలాంటి ఒక ఐటెం భామ మొదటిసారి కన్నీరు కార్చింది.

సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో, సినిమాలలో అలరించే స్టెప్స్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న అప్సర రాణి అలియాస్ ఆర్జీవీ హీరోయిన్ బోరుమంటూ ఏడుస్తూ తన సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఎప్పుడు నవ్వుతుండే పాలరాతి శిల్పంలా ఉండే అప్సర రాణి ఎందుకు ఇంతలా ఏడ్చింది, ఆమె అంతలా బాద పెట్టింది ఎవరు అని తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.

క్రాక్ సినిమాలో భూమ్ బద్దలు సాంగ్ తో ఐటెం గర్ల్ అవతారం ఎత్తిన ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలలో ఐటెం సాంగ్ లకు కేరాఫ్ గా నిలుస్తుంది. హీరోయిన్ గా పలు చిన్న, చిన్న సినిమాలు చేస్తూనే మెయిన్ స్ట్రీమ్ సినిమాలలో ఐటెం సాంగ్స్ కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇటీవలనే షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకున్న ఈ బ్యూటీ ఇంట్లో కూర్చొని సినిమాలు చూడటం స్టార్ట్ చేసింది.

- Advertisement -

అయితే రీసెంట్ గానే ఒక సినిమా చూసిన అప్సర కన్నీరు మున్నీరైంది. ఏడుస్తూ ఫోటోలు , వీడియోలు పెడుతూ ఆమె ఇంస్టాగ్రామ్ నింపేసింది. ఇంతకు ఈ బ్యూటీని అంతగా ఏడిపించిన ఆ సినిమా ఏమై ఉంటుందా అనుకుంటున్నారా..? ఆ సినిమా పేరు 777చార్లీ. గతేడాది రిలీజైన ఈ సినిమా థియేటర్స్ వసూళ్ల వర్షం కురిపించి సూపర్ హిట్ గా నిలిచింది. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమా డాగ్ (కుక్క ) సెంటిమెంట్ ప్రధానంగా సాగుతుంది. సాధారణ వ్యక్తులకు ఇది ఎంతవరకు నచ్చుతుందో తెలీదు కానీ కుక్కలను అమితంగా ప్రేమించే వాళ్లను మాత్రం ఈ సినిమా ఎమోషనల్ గా ఏడిపిస్తుంది. గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిని ఏడిపించిన ఈ సినిమా లేటెస్ట్ గా ఈ బ్యూటీని కూడా ఏడిపించింది . ఇటీవలనే ఈ సినిమా చూసిన ఈ భామ ఏడుస్తూ ఫోటోలు , వీడియోలు పెడుతూ ఆమె ఇంస్టాగ్రామ్ లో హల్చల్ చేస్తుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు