Pawan Kalyan: అడ్వాన్స్ బుకింగ్స్ తో ఓవర్సీస్ లో దుమ్ములేపుతున్న “బ్రో”

టాలీవుడ్ లో ఈ ఏడాది రిలీజ్ అవుతున్న భారీ సినిమాల్లో “బ్రో” ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించిన “బ్రో” సినిమా ను సముద్రఖని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసింది. దానికి తగ్గట్టు గానే ఈ సినిమా బుకింగ్స్ కూడా జరుగుతుండడం విశేషం. ముఖ్యంగా ఓవర్సీస్ లో వారం రోజులు ముందుగానే బ్రో సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

ఇక ఓవర్సీస్ లో మామూలుగానే టాక్ తో సంబంధం లేకుండా పవన్ సినిమాలు ప్రీమియర్స్ కే రికార్డు వసూల్లొస్తాయని తెలిసిందే. అదే విధంగా ఇప్పుడు బ్రో సినిమా కూడా ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే దుమ్ము లేపుతుంది. సినిమా రిలీజ్ కి నాలుగు రోజులు ఉండగానే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రెండు లక్షల డాలర్లు వసూలు చేసింది ఈ సినిమా. రిలీజ్ డేట్ వచ్చే సరికి బ్రో సినిమా ప్రీమియర్స్ తో కలిపి ఫస్ట్ డే 1 మిలియన్ డాలర్స్ రాబట్టే అవకాశం ఉందని చెప్పాలి.

ఇక తెలుగు రాష్ట్రాల్లో నార్మల్ రేట్లతోనే “బ్రో” రిలీజ్ అవుతుంది. ఇక్కడ కూడా భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోవడం ఖాయమని చెప్పాలి. ముఖ్యంగా నైజాం లో మరోసారి ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ తెచ్చుకోవచ్చు. ఆన్లైన్ బుకింగ్స్ స్పీడ్ చూస్తుంటే ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్లకి పైగా షేర్ రాబట్టే అవకాశం ఉంది. మరి బ్రో సినిమా ఓవర్సీస్ లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు