Tollywood: రసవత్తరంగా మారిన క్రిస్మస్ పోటీ!

టాలీవుడ్ లో ఈ ఏడాది క్రిస్మస్ లో భారీ సినిమాలు తలపడనున్నాయి. సాధారణంగా తెలుగులో సినిమాల సీజన్ ఏదంటే సంక్రాంతి, దసరా, లేదా సమ్మర్ అని అంటారు. కానీ ఈ ఏడాది మాత్రం క్రిస్మస్ బరిలో పలు ప్రతిష్టాత్మక సినిమాలు పోటీకి రెడీ అవుతున్నాయి. ఈ ఏడాది సమ్మర్ లో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కాకపోగా ఆ లోటును క్రిస్మస్ తో భర్తీ చేసేందుకు రెడీ అవుతున్నారు స్టార్స్.

ముందుగా డిసెంబర్ 21న నాని హీరోగా నటిస్తున్న ఫీల్ గుడ్ మూవీ “హాయ్ నాన్న” విడుదల కానుంది. నూతన దర్శకుడు శౌర్యవ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. హేషం అబ్దుల్ వాహబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా “సైంధవ్” డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. ఈ సినిమాను శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తుండగా, నీహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా శ్రద్దా శ్రీనాథ్, నవాజుద్దీన్ సిద్ధికి, ఆండ్రియా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. క్రిస్మస్ కి రాబోయే సినిమాల్లో ఎక్కువ క్రేజ్ ఉంది ఈ సినిమాకే.

- Advertisement -

ఇక తాజాగా ఈ బరిలోకి నితిన్ ఎంటరయ్యాడు. నితిన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్”. వక్కంతం వంశీ దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతుండగా, శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 23, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది.

వీటితో పాటు సుధీర్ బాబు హీరోగా జ్ఞాన సాగర్ దర్శకత్వంలో వస్తున్న “హరోం హర”, అలాగే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో నటిస్తున్న “డుంకి” కూడా డిసెంబర్ 22న విడుదల కానున్నాయి. ఇక ఎప్పుడూ ఒకటి అరా చిత్రాలతోనే క్రిస్మస్ లో సినిమాలు వచ్చేవి. కానీ ఈ క్రిస్మస్ కి ఐదుకి పైగా సినిమాలు రిలీజ్ కానుండడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొని ఉంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు