BABY : వైష్ణవి చైతన్య నెక్స్ట్ సినిమా హీరోతోనే ?

బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య ప్రస్తుతం టాలీవుడ్ టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన బేబీ సినిమా ఈ నెల 14న రిలీజై, సంచలన విజయం అందుకోవడంతో వైష్ణవికి వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో వైష్ణవి చైతన్య ఓవర్ నైట్ లో పాపులర్ అవడంతో మీడియం రేంజ్ సినిమాలకు వైష్ణవి చైతన్య ఫస్ట్ ఛాయిస్ మారుతుంది.

టాలీవుడ్ లో ఎప్పటినుంచొ తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరనే మిత్ ను వైష్ణవి చైతన్య తొందర్లోనే బ్రేక్ చేసే సూచనలు భారీగానే కనిపిస్తున్నాయి. ఇటీవలనే బేబీ సక్సెస్ మీట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అటెండ్ అవ్వగా, బేబీ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. వైష్ణవి నటనను తెగ మెచ్చుకున్నాడు. అలాగే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్సే రావాలి అంటూ స్టేజ్ పైన చెప్పుకొచ్చాడు. గతంలో ప్రి రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ కూడా వైష్ణవి మరిన్ని సినిమాలు చేయాలంటూ బ్లెస్ చేసాడు. ఇక ఈ పొగడ్తలన్నీ ప్రస్తుతం నిజం అవుతున్నాయి.

ఇటీవలనే వైష్ణవి చైతన్య గీత ఆర్ట్స్ లో ఒక ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా ఓకే చేసినట్టు సమాచారం అందుతోంది. అల్లు అరవిందే స్పెషల్ గా ఈ స్క్రిప్ట్ వినమని వైష్ణవి చైతన్యకు పంపించినట్టు టాక్. వైష్ణవి చైతన్యకు కూడా స్క్రిప్ట్ నచ్చి, ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సినిమాపై తొందరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా రానుంది. ఇక ఈ సినిమాతో పాటు అల్లు శిరీష్ చేయబోయే తరువాతి సినిమాలోనూ వైష్ణవి చైతన్యనే హీరోయిన్ గా తీసుకోబోతున్నారట. బేబీ సినిమా వల్ల వైష్ణవికి మంచి క్రేజ్ రావడంతో ఆ క్రేజ్ అల్లు శిరీష్ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారట. ఇక దీన్నిబట్టి చూస్తే వైష్ణవి చైతన్య తొందరలోనే టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అవడం కన్ఫామ్ అని తెలుస్తోంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు