VarunTej: మొదటి అస్త్రాన్ని సంధించిన “గాండీవధారి అర్జున”…

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో “గాండీవధారి అర్జున” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక సాక్షి వైద్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇంతకు ముందు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, ప్రీ టీజర్ల ద్వారానే హైప్ భారీగా పెరిగిపోగా, తాజాగా రిలీజ్ చేసిన అఫిషియల్ టీజర్ తో అంతకు రెట్టించిన హైప్ పెంచేసింది చిత్ర యూనిట్.

సాగదీయకుండా 1.18 నిమిషాల నిడివితో రిలీజ్ చేసిన టీజర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా టీజర్ ని కట్ చేసిన విధానం, దానికి తగ్గట్టు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. టీజర్ లో గూఢచారి రా ఏజెంట్ గా కనిపించిన వరుణ్ తేజ్ వన్ అఫ్ ది బెస్ట్ లుక్స్ తో కనిపించాడు. ఇక టీజర్ ద్వారా హీరోయిన్ సాక్షి వైద్య కూడా ఈ సినిమాలో ఏజెంట్ టీమ్ తోనే కలిసి పనిచేసే వ్యక్తిగా నటిస్తుందని తెలిసింది.

- Advertisement -

ఈ సినిమా “ఫైల్13” అనే వస్తువు కోసం నడుస్తుందని టీజర్ లో చెప్పడం జరిగింది. మరి అది ఒక ఫైల్ కావచ్చు, లేదా ఏదైనా ఒక వస్తువు కావచ్చు. లేక మరేదైనా చిప్ కార్డు కావచ్చు. ఓవరాల్ గా ఆ మిషన్ పైనే ఆఫీసర్ అర్జున్ వర్మ ని సెలెక్ట్ చేస్తారు. మరి ఆ మిషన్ ని ఛేదించాడా లేదా అన్నది సినిమా కావచ్చు. టీజర్ చూసాక ఒక్కమాటలో చెప్పాలంటే ప్రామిసింగ్ గా అనిపిస్తుందని చెప్పవచ్చు.

ఇక ఈ సినిమాలో నాజర్, విమల రామన్, వినయ్ రాజ్, నరైన్, రోషిని ప్రకాష్, అభినవ్ గౌతమ్, రవి వర్మ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఇక “గాండీవధారి అర్జున” ఆగష్టు 25న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు