Ileana: ఇలియానాపై నిషేధం ?

టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ గా పేరు పొందింది ఇలియానా. మొదట 2006లో విడుదలైన దేవదాసు చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఇలియానాతో పాటు హీరో రామ్ పోతినేని నటించి హీరోగా పరిచయమయ్యారు. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకోవడంతో ఆ వెంటనే పోకిరి సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది ఈ భామ. ఇక అమర్ అక్బర్ ఆంటోనీ తర్వాత ఇలియానా తెలుగు తెరపై కనిపించలేదు.

అయితే బాలీవుడ్ పై ఉన్న మోజుతోనే ఇలియానా సౌత్ ఇండస్ట్రీని పక్కకి పెట్టిందని అంతా అనుకున్నారు. కానీ ఆమె కావాలని సౌత్ సినిమాలకు దూరంగా వెళ్లలేదట. సౌత్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇలియానాపై నిషేధం విధించిందట. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ నిజం ఇప్పుడు బయటకు వచ్చింది. దేవుడు చేసిన మనుషులు సినిమా సమయంలోనే ఇలియానా ఓ హాలీవుడ్ సినిమా చేసేందుకు ఒప్పుకుంది. కోలీవుడ్ నిర్మాత నటరాజ్ విక్రమ్ హీరోగా నందం అనే మూవీ ప్లాన్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇలియానాను తీసుకున్నారు. ఆమెకు రూ. 40 లక్షలు కూడా అడ్వాన్స్ ఇచ్చారట. అయితే అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది.

దీంతో అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇవ్వమని నిర్మాత అడిగితే దానికి ఇలియానా నిరాకరించిందట. కావాలంటే మరో సినిమాలో నటిస్తాను కానీ డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వనని తెగేసి చెప్పిందట. దీంతో సదరు నిర్మాత నడిగర్ సంఘంతో పాటు సౌత్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ని ఆశ్రయించారట. వారు కూడా చెప్పినా వినకపోవడంతో డబ్బులు తిరిగి ఇచ్చేవరకు ఇలియానాను సౌత్ సినిమాల్లో తీసుకోకూడదని నిర్ణయించుకున్నారట. అందుకే ఇలియానా తెలుగు సినిమాలకు దూరమైనట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఈ సమస్యను ఇలియానా పరిష్కరించుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు