Samantha: ఆరోగ్యం ఎలా ఉందంటే..?

మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే సినిమాలలో యాక్టివ్ అవుతుంది. ఓవైపు ఈ వ్యాధికి సంబంధించి చికిత్స తీసుకుంటూనే మరోవైపు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. జిమ్ లో కసరతులు చేస్తూ మళ్ళీ ఫిట్ గా తయారవుతుంది. మయోసైటీస్ వ్యాధి నుంచి కోలుకున్న సమంత యశోద మూవీ తరువాత మరే సినిమాలోను నటించలేదు.

ప్రస్తుతం సమంత శాకుంతలం, ఖుషి చిత్రాలలో నటిస్తోంది. ఇందుకోసం జిమ్ లో తీవ్రంగా కసరత్తులు ప్రారంభించింది. తాజాగా జిమ్ లో సమంత చెమటోడ్చుతున్న వీడియోను తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మయోసైటిస్ కు సంబంధించి నెలవారీ ఐవిఐజి ( ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబలిన్ థెరపీ) సెషన్ కు హాజరైనట్లు తెలిపింది.

దీనికోసం రోజు రెండు నుంచి నాలుగు గంటల సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన చికిత్సలు సమంత ఇంట్లోనే తీసుకుంటుంది. శరీరంలో బలహీనపడిన ఇమ్యూనిటీ సిస్టంలు సమర్థవంతంగా పనిచేయడంతో పాటు ఇతర వ్యాధుల కారణంగా ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఈ థెరపీ సహాయపడుతుంది.

- Advertisement -

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన శాకుంతలం ఈ నెల 17న విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. కానీ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14 కు వాయిదా వేసుకున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. దీంతోపాటు విజయ్ దేవరకొండ తో కలిసి సమంత ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు