Malavika Mohan: ఆ హీరోతో నటించాలని ఉంది

అందాల ముద్దుగుమ్మ మాళవిక మోహన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ పేట సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ బ్యూటీ. అలాగే ఆమధ్య దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన మాస్టర్ సినిమాలో నటించి అందరిని మెప్పించింది. బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న మాళవిక బ్యూటిఫుల్ గా ఉండటమే కాదు ఎంతో మంది అభిమానులను సైతం సొంతం చేసుకుంది.

ఇక తన హాట్ ఫోటోలను సైతం సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ నేటిజన్లను సైతం కనువిందు చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ చేసింది కొన్ని సినిమాలే అయినా తన అందంతో మరింత పాపులారిటీ అని తెచ్చుకుంది. అయితే మలయాళ, తమిళ చిత్రాలలో మంచి పేరు తెచ్చుకున్న ఈమె ఇప్పుడు టాలీవుడ్ వైపు చూస్తోంది.

ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రంలో మాళవిక నాయకిగా అవకాశం దక్కించుకుంది. అంతేకాకుండా మరికొందరు స్టార్ హీరోల సరసన నటించేందుకు ఆసక్తి చూపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే మాళవిక తండ్రి కేయు మోహనన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అన్న విషయం తెలిసిందే.

- Advertisement -

ఈయన మహర్షి చిత్రానికి పనిచేశారు. తాజాగా మాళవిక మాట్లాడుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి స్పందించింది. ” మహర్షి సినిమా షూటింగ్ సమయంలో నాన్న మోహన్ తో కలిసి షూటింగ్ కి వెళ్లాను. అక్కడ మహేష్ బాబుని కలిసే అవకాశం దొరికింది. ఆయన నన్ను ఎంతో ఫ్రెండ్లీగా పలకరించారు. మహేష్ బాబుతో కలిసి నటించేందుకు ఎదురుచూస్తున్నా” అని చెప్పుకొచ్చింది.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు