Tamannaah: నా కల నిజమైంది

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి, ఈమె అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వయసు పెరుగుతున్నకొద్దీ… ఇంకా అందంగా తయారవుతుంది మిల్క్ బ్యూటీ తమన్నా. సినిమా పరిశ్రమకు వచ్చి చాలా సంవత్సరాలు అవుతున్నా కూడా తన అందం ఏమాత్రం చెక్కుచెదరలేదు. 2007 లో హ్యాపీడేస్ చిత్రం ద్వారా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తమన్న అంతకంటే ముందు శ్రీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది.

తన అందం, టాలెంట్ తో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం సౌత్, నార్త్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది తమన్నా. ఇటీవల గుర్తుందా శీతాకాలం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది. ఇక తాజాగా ఇద్దరు అగ్ర హీరోలతో ఆడి పాడడానికి సిద్ధమైంది.

మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో, సూపర్ స్టార్ రజినీకాంత్ తో జైలర్ చిత్రంలో ఈ బ్యూటీ నటించనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ రెండు చిత్రాల గురించి తమన్న మాట్లాడుతూ.. ” సూపర్ స్టార్ రజిని సార్ తో కలిసి పని చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు. నా కల నిజమైంది. ఆయనని సెట్ లో చూసే రోజు కోసం ఎదురుచూసా. అలాగే చిరంజీవితో కలిసి నేను సైరా నరసింహారెడ్డి లో నటించాను. ఇప్పుడు మళ్లీ భోళా శంకర్ లో నటించే అవకాశం దక్కింది. ఆయనతో కలిసి డ్యాన్స్ చేయడానికి ఉత్సాహంగా ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆస్కార్ బరిలో నిలిచిన ఆర్ఆర్ఆర్ పై స్పందిస్తూ.. రాజమౌళి అందరినీ గర్వించేలా చేశారని ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు