Kantara 2 : ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో ఐటెం బ్యూటీ

ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలు వేరే భాషల్లో పెద్దగా రిలీజ్ అయ్యావి కాదు. కానీ కేజీఎఫ్ చిత్రం అదంతా మార్చేసింది. ఈ చిత్రం కన్నడ భాషలోనే కాకుండా అన్నీ భాషలో రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. ఈ విజయం తర్వాత శాండిల్ వుడ్ లో రిలీజ్ అయిన ప్రతి ఒక సినిమా ఇప్పడు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి.

ఆలా రిలీజ్ అయిన సినిమాలో కాంతారా ఒకటి. ఈ సినిమా తక్కువ అంచనాలతో వచ్చి దేశమంతటా మంచి విజయాన్ని సాధించింది. రిషబ్ శెట్టి యాక్టింగ్ తో పాటు పంజుర్లి కథ ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. “కాంతారా” బ్లాక్ బస్టర్ సక్సెస్ తో… ఈ సినిమాకి ప్రీక్వెల్ ఉంటుందని మేకర్స్ ఇటీవల ప్రకటించారు. అంతే కాదు.. త్వరలోనే షూటింగ్ మొదలు పెడతామని ప్రకటించారు. రిషబ్ శెట్టి కాంతారా 2 కథను సిద్ధం చేసుకొని ప్రీ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేస్తున్నాడు. కొత్త నటి నటులను కూడా సంప్రదిస్తూ చాలా బిజీగా ఉన్నాడు.

కాంతారా 2 చిత్రం కూడా పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది. దానికి కోసం బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌటేలాను సంప్రదించారు మేకర్స్. తాను ఒకే చెప్పినట్టు ఈ మధ్య కాలంలో చాలా వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ ట్వీట్ చేసారు ఊర్వశి. కాంతార హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టితో కలిసి ఉన్న ఫోటోను ఊర్వశి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

- Advertisement -

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి భాగం కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ బ్యూటీ సినిమాలో పాత్ర చేస్తుందా ? లేదా స్పెషల్ సాంగ్ లో కనిపిస్తుందా ? పాత్ర చేస్తే.. ఎలాంటి పాత్ర చేస్తుంది ? అంటూ అభిమానుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. కాగా వీటికి సమాధానం రావాలంటే.. కాంతార 2 వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు