Ilayaraja Biopic Launch : ధనుష్, కమల్, వెట్రిమారన్ స్పీచ్… ఇళయరాజా గురించి ఏం అన్నారంటే?

టాలెంటెడ్ కోలీవుడ్ స్టార్ ధనుష్ ప్రస్తుతం రాయన్, కుబేర వంటి ఇంట్రెస్టింగ్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన మాస్ట్రో ఇళయరాజా బయోపిక్ లో నటించబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్ లో ధనుష్ ఇళయరాజా పాత్రను పోషించబోతున్నారు. రీసెంట్ గా ధనుష్ హీరోగా కెప్టెన్ మిల్లర్ అనే మూవీ వచ్చిన విషయం తెలిసిందే. దీనికి దర్శకత్వం వహించిన అరుణ్ మాతేశ్వరన్ ఇళయరాజా బయోపిక్ కు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. మార్చి 21న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చెన్నైలో రివీల్ చేశారు. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్, వెట్రి మారన్, ధనుష్, భారతి రాజా తదితరులు పాల్గొన్నారు.

ఈ ఈవెంట్ లో ధనుష్ మాట్లాడుతూ కమల్ హాసన్ తో పాటు తనను అభినందించడానికి వచ్చిన వారందరికీ ముందుగా నమస్కరించారు. ఆ తర్వాత ధనుష్ ఇళయరాజా బయోపిక్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మనలో చాలామంది రాత్రి పూట నిద్ర పట్టకపోతే ఇళయరాజా పాటలు వింటూ ఒక రకమైన ట్రాన్స్ లో పడిపోతామని గుర్తు చేశారు. అయితే ఇళయరాజాగా నటిస్తే ఎలా ఉంటుందో అని తాను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని ఈ సందర్భంగా ధనుష్ తెలియజేశారు. ఇక ఇప్పటిదాకా తాను ఇద్దరి బయోపిక్ లలో నటించాలని కలలుగన్నానని వెల్లడించారు ధనుష్. అందులో ఒకటి సూపర్ స్టార్ రజినీకాంత్ బయోపిక్ అయితే, మరొకటి ఇళయరాజా బయోపిక్ అని అన్నారు.

ఎట్టకేలకు ఇళయరాజా బయోపిక్ లో నటించే అద్భుతమైన అవకాశం దక్కిందని చెప్పుకొచ్చారు. ఇక చిన్నప్పటి నుంచే ఇళయరాజా సార్ కు పెద్ద అభిమానినని, భక్తుడిని అని, ఆయన సంగీతమే తనకు తోడుండి ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పుకొచ్చారు. ఆయన సంగీతమే తనకు నటనను నేర్పించిందని, కెరీర్ మొదటి నుంచి ఏదైనా సీన్ చేసే ముందు దానికి తగ్గట్టుగా ఇళయరాజా పాట లేదా మ్యూజిక్ వింటానని, ఆ సంగీతమే ఆయా సన్నివేశాల్లో ఎలా నటించాలనే విషయాన్ని తనకు చెబుతుందని, దానికి తగ్గట్టుగానే తాను నటిస్తాననీ తన అదిరిపోయే యాక్టింగ్ స్కిల్స్ వెనకున్న సీక్రెట్ ను వెల్లడించారు.

- Advertisement -

అయితే ఇళయరాజా పాత్రను పోషించడం చాలా పెద్ద ఛాలెంజ్, బాధ్యత అని అంటున్నారని, కానీ ఇప్పుడు ఆయన సంగీతమే అతనిలా ఎలా నటించాలో తనకు చెబుతుందని ఉద్వేగంగా మాట్లాడారు ధనుష్. ఇక ఇళయరాజాతో తను జర్నీ స్టార్ట్ చేసిన మొదట్లో సర్ అని పిలిచేవాడినని, కానీ ఆ తర్వాత తమ రిలేషన్షిప్ అయ్యా అని పిలిచేదాక డెవలప్ అవ్వడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ఆయన తన వెన్నంటే ఉండి నడిపిస్తున్నారని, తనకు జీవితంలో ఇంతకంటే పెద్ద కల మరొకటి లేదని ధనుష్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ ఇళయరాజా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తను నటించిన గుణ సినిమాలోని “ప్రియతమా నీవచట కుశలమా” అనే పాటను గుర్తు చేస్తూ ఇళయరాజా సంగీతం ఎవర్గ్రీన్ అని, వందేళ్లు గడిచిపోయిన తర్వాత కూడా ఆయన మ్యూజిక్ లో ఉన్న మ్యాజిక్ ఏ మాత్రం తగ్గదని చెప్పుకొచ్చారు. ఇక ఇళయరాజాతో తన జర్నీని గుర్తు చేసుకున్న ఆయన బయోపిక్ గురించి డైరెక్టర్ కు అడ్వైజ్ ఇచ్చారు. ఇళయరాజా గురించి వాస్తవాన్ని మాత్రమే చెప్పండి. సినిమా విషయంలో ఎలాంటి ఒత్తిడి తీసుకోకండి. ఎందుకంటే ఈ సినిమా సంగీత విద్వాంసుడు ఇళయరాజాది కాదు…. భారతరత్న ఇళయరాజా సినిమా… ఇది నా రిక్వెస్ట్ అంటూ ముగించారు.

ఈ సందర్భంగా వెట్రిమారన్ మాట్లాడుతూ ఇళయరాజా సంగీతం అమ్మ ప్రేమ లాంటిదని అన్నారు. అదేవిధంగా ఆయనతో వ్యవహారం గందరగోళం లేకుండా ఈజీగా, స్నేహపూర్వకంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇళయరాజా డైరెక్టర్లను ఫ్రెండ్లీగా చూస్తాడని అందుకే తాను ఆ మాట అన్నానని చెప్పుకొచ్చారు. ఫ్రెండ్ అనగానే తాను ఆయన ఫ్రెండ్ అని కాదు గాని, ఆయన మాత్రం అదే విధంగా చూస్తారని అన్నారు. ఆయనెప్పుడూ బేదభావాన్నీ చూపించలేదని, అలాగే ఇళయరాజాతో వర్క్ చేసేటప్పుడు ఏదైనా సజెషన్ ఇవ్వడానికైనా, రిక్వెస్ట్ చేయడానికైనా స్పేస్ ఇస్తారని, దానికి తగ్గట్టుగానే మ్యూజిక్ ఇస్తారని తెలిపారు. ఈ సందర్భంగా వెట్రిమారన్ ఆయనతో కలిసి ప్రయాణించే అవకాశం తనకు ఇచ్చినందుకు ఇళయరాజాకు ధన్యవాదాలు తెలిపారు. ఇళయరాజా సంగీతం ఒక మ్యాజిక్ అని, ఆయన జీవిత కథను సినిమాగా తెరకెక్కించడం గొప్ప విషయం అని, అందరిలాగే తాను కూడా ఇళయరాజా బయోపిక్ ను తెరపై చూడడానికి ఉత్సాహంగా ఉన్నానని అన్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు