Prithviraj Sukumaran : చిరు ఆఫర్నే 2 సార్లు రిజెక్ట్ చేసిన మలయాళ నటుడు.. కారణం.?

పృథ్వీరాజ్ సుకుమారన్ ( Prithviraj Sukumaran ).. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈయన పేరే వినిపిస్తోంది. తెలుగు, తమిళ్, మలయాళం అంటూ వరుసగా సౌత్ ఇండియన్ భాషలలో అవకాశాలు దక్కించుకుంటూ మోస్ట్ వాంటెడ్ విలన్ గా పేరు సొంతం చేసుకున్నారు.. ఇటీవల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న సలార్ సినిమాలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.. ఇక ఇప్పుడు తాజాగా ఈయన గురించి ఒక వార్త ఇండస్ట్రీని కుదిపేస్తోంది.

చిరంజీవి ఆఫర్ ని తిరస్కరించిన పృథ్వీరాజ్..

Prithviraj Sukumaran
Prithviraj Sukumaran

ఇకపోతే తాజాగా వైరల్ అవుతున్న విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి రెండుసార్లు స్వయంగా ఇచ్చిన ఆఫర్లను పృథ్వీరాజ్ తిరస్కరించారట. ఈ విషయం తెలిసిన అభిమానులు ఇతడికి ఏమైనా పిచ్చి పట్టిందా..? చిరు లాంటి స్టార్ హీరో అడిగితే కాదనడం ఏంటి? పైగా మెగాస్టారే స్వయంగా వచ్చి అడిగితే.. చెయ్యను అని చెప్పి అవమానించడం ఏంటి ? అంటూ కూడా చిరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అయితే ఆఫర్లను పృథ్వీరాజ్ రిజెక్ట్ చేయడానికి కూడా కారణాలు ఉన్నాయట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఆఫర్ తిరస్కరించడానికి కారణం ఇదే..

సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి అంటే.. ఈయనతో కలిసి నటించడానికి సీనియర్ల దగ్గర్నుంచి జూనియర్ల వరకు ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉంటారు.. చిరు పక్కన కనీసం ఒక చిన్న పాత్ర వచ్చినా చాలు అని భావించేవారు కూడా లేకపోలేదు.. అలాంటి మెగాస్టార్ చిరంజీవి పిలిచి మరీ పాత్ర ఇస్తాను అంటే సలార్ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ ( Prithviraj Sukumaran ) మాత్రం చేయలేదట.. ఏకంగా రెండుసార్లు మెగాస్టార్ ఇచ్చిన ఆఫర్ ని రిజెక్ట్ చేశారట.. దానికి కారణం ఏంటా అని ఆరా తీయగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి సైరా నరసింహారెడ్డి చేసిన విషయం తెలిసిందే.. ఆ సినిమాలో కన్నడ హీరో కిచ్చా సుదీప్ పోషించిన పాత్రకు మొదట పృధ్వీరాజ్ నే అనుకున్నారు..ఈ పాత్రకు ముందుగా పృథ్వీరాజ్ ను చిరంజీవి స్వయంగా సూచించారట.

- Advertisement -

అయితే అప్పటికే ఆడు జీవితం అనే సినిమా కోసం భారీగా బరువు తగ్గిన ఈయన ఆ సినిమా అవకాశాన్ని వదులుకున్నారు.. దీని తర్వాత వెంటనే మరో లక్కీ ఛాన్స్ అతడి తలుపు తట్టింది.. సైరా మూవీ ప్రమోషన్స్ కోసం కేరళ వెళ్లిన చిరు..ఆ సమయంలో మోహన్ లాల్ నటించిన లూసీఫర్ సినిమా విడుదలయ్యింది..ఈ చిత్రానికి పృధ్వీరాజ్ సుకుమారన్ డైరెక్టర్.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో తెలుగు హక్కులను మెగాస్టార్ కొనుగోలు చేశారు.. తెలుగు రీమేక్ కి దర్శకత్వం వహించాల్సి ఉందిగా మరోసారి కోరగా.. కానీ ఆడు జీవితం సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల ఆ ఆఫర్ ని కూడా రిజెక్ట్ చేశారు పృథ్విరాజ్.. ఇక ఈ విషయాన్ని పృథ్వీరాజ్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.. మొత్తానికైతే అనివార్య కారణాలవల్ల మెగాస్టార్ తో నటించే అవకాశాన్ని మిస్ చేసుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు