Mohan Babu: మోహన్ లాల్ ని రిక్వెస్ట్ చేస్తున్న డైలాగ్ కింగ్..ఏమైందబ్బా ..?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. తాను స్థాపించిన మోహన్ బాబు యూనివర్సిటీ 32వ యాన్యువల్ డే కార్యక్రమం తిరుపతిలో మంగళవారం రాత్రి చాలా ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమానికి మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మోహన్ లాల్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించిన మోహన్ బాబు.. కన్నప్ప సినిమాలో కూడా ఈయన నటిస్తున్నారు అని తెలిపి మోహన్ లాల్ మంచితనం గురించి మాట్లాడి.. ఆ తరువాత మోహన్ లాల్ సినిమాలో తనకు ఓ క్యారెక్టర్ ఇవ్వమని కూడా రిక్వెస్ట్ చేశారు మోహన్ బాబు..

మోహన్ లాల్ ను రిక్వెస్ట్ చేస్తున్న మోహన్ బాబు..

నేను మోహన్ లాల్ ఎప్పటినుంచో మంచి మిత్రులం.. కానీ మేమిద్దరం ఇప్పటి వరకు కలిసి నటించలేదు.. ఇప్పుడు కన్నప్పలో ఇద్దరం నటిస్తున్నాము.. కానీ మా ఇద్దరి కాంబోలో సీన్స్ లేవు.. దయచేసి మీతో నటించడానికి..మీ సినిమాలో నాకు ఒక అవకాశం ఇవ్వు ప్లీజ్.. నాకు నీ పక్కన ఒక విలన్ రోల్ చేయాలని ఆశగా ఉంది.. కానీ నువ్వు నన్ను కొట్టొద్దు.. కావాలంటే గట్టిగా అరువు నా మీద అని అడిగారు మోహన్ బాబు.. దీంతో స్టేజి ముందు కూర్చున్న మోహన్ లాల్ కూడా ఓకే అన్నారు.. ఇక మోహన్ బాబు వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.. ఇకపోతే మోహన్ బాబు మోహన్ లాల్ సినిమాలో విలన్ గా నటిస్తారా లేదా అన్నది చూడాలి.

- Advertisement -

మోహన్ లాల్ వల్లే సక్సెస్ సాధ్యం..
కొట్టొద్దు అంటూ మోహన్ లాల్ ను రిక్వెస్ట్ చేస్తున్న మోహన్ బాబు..కెరియర్ డౌన్ అయినప్పుడు మోహన్ లాల సహాయం చేశారట.. ఈ విషయంపై మోహన్ బాబు మాట్లాడుతూ.. నేను హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పలు సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాను.. అయితే నిర్మాతగా కొన్ని సినిమాలు తీసి డబ్బు కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది.. అలాంటి సమయంలో మోహన్ లాల్ తీసిన చిత్రం సినిమాని నేను అల్లుడుగారు అనే టైటిల్ తో తెలుగులో రీమేక్ చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాను.. ఇక మోహన్ లాల్ సినిమా వల్లే మళ్ళీ నేను కెరియర్ లో సక్సెస్ అయ్యి నిలదొక్కుకోగలిగాను అంటూ తెలిపారు మోహన్ బాబు..

మోహన్ లాల్ చాలా గొప్పవారు..
అలాగే మోహన్ లాల్ మంచితనం గురించి మాట్లాడుతూ.. నా కొడుకు మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాలో కూడా మోహన్ లాల్ నటిస్తున్నారు. అయితే పారితోషకం తీసుకోలేదు.. అడిగితే వద్దు నేను వచ్చి నటించి వెళ్తాను అన్నారు.. అలాగే స్టార్ నటుల్ని వేరే దేశాలకు తీసుకెళ్లాలంటే వాళ్లతో పాటు ఐదారుగురు అసిస్టెంట్స్ కూడా వస్తారు.. కానీ మోహన్ లాల్ మాత్రం ఎవ్వరూ వద్దు.. నేను ఒక్కరినే తెచ్చుకుంటాను.. నా మేకప్ నేనే వేసుకుంటాను.. నిర్మాతకు ఖర్చు పెరగదు అని కన్నప్పకి కేవలం ఒక్క అసిస్టెంట్ తోనే వచ్చారు..అంత మంచి మనిషి అంటూ తెలిపారు..

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు