Parenting Tips : పిల్లలతో ఇలా బిహేవ్ చేశారంటే నెగెటివ్ ఎఫెక్ట్ తప్పదు

తల్లిదండ్రులు పదే పదే తమాషా చేయడం, వెక్కిరించడం, లేదా ఇతరులతో పోల్చడం వంటివి చేస్తే అవి పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. పిల్లలు తమ తల్లిదండ్రులను, వాళ్ళు చేసే పనులను చూసే లైఫ్ లెసన్స్ నేర్చుకుంటూ పెరుగుతారు. బయట ప్రపంచంలోకి అడుగుపెట్టక ముందే ఇంట్లోనే ఈ విధంగా జీవిత పాఠాలు మొదలవుతాయి. అలాంటిది తల్లిదండ్రులు ఏదైనా తప్పు చేస్తే అది జీవితాంతం వారి మనసులో అలాగే నిలిచిపోతుంది. పేరెంట్స్ తమ పిల్లల ప్రవర్తన, ఆహారపు అలవాట్ల గురించి ఎగతాళి చేయడం వల్ల పిల్లలపై తీవ్రమైన నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. చిన్నప్పటి నుంచే వాళ్ళ మనసులో భయం అనేది పేరుకుపోతుంది. కాబట్టి పొరపాటున కూడా పిల్లలతో కింద చెప్పుకోబోయే విధంగా బిహేవ్ చేయకండి. అలాగే వాళ్లను కొన్ని కామెంట్స్ తో తక్కువ చేసి మాట్లాడకండి.

1. ఆడపిల్లలా ఏడుపు…
చాలామంది కొడుకులు ఎక్కువగా ఏడిస్తే ఆడపిల్లలా ఎందుకు ఏడుస్తున్నావ్ అంటూ కోప్పడతారు. అంటే ఏడుపు ఆడపిల్లల స్వభావమని, అబ్బాయిలకు అసలు ఏడ్చే హక్కు లేదని అనిపిస్తుంది పిల్లలకు. ఇలాంటి కామెంట్ చేయడం వల్ల పిల్లల్లో తప్పుడు ఆలోచన మొదలవుతుంది.

2. టీ తాగితే నల్లబడిపోతారు
చాలామంది తల్లులు తమ పిల్లలకు టీ తాగే అలవాటును మాన్పించడానికి కష్టపడతారు. అయితే కొంతమంది మాత్రం తెలివిగా టీ తాగితే నల్లబడిపోతారని చెప్తారు. ముఖ్యంగా అమ్మాయిలు టీ తాగితే నల్లగా, పాలు తాగితే తెల్లగా అవుతారని చెబుతారు. దీనివల్ల పిల్లల్లో వర్ణ వివక్ష భావన పెరుగుతుంది. వాస్తవానికి టీ తాగితే నల్లగా, తాగకపోతే తెల్లగా ఉంటారని ఎక్కడా ప్రూవ్ అవ్వలేదు.

- Advertisement -

3. తక్కువచేసి మాట్లాడడం
తల్లిదండ్రులు తమ పిల్లల ఆహారపు అలవాట్లను నిరంతరం విమర్శిస్తూ, వారి శరీర ఆకృతిపై కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు చేసే ఈ తప్పు కారణంగా పిల్లలు తమ రూపం గురించి ఇన్ సెక్యూర్ గా ఫీల్ అవుతారు. అప్పుడు మొదలయ్యే ఆ భయం వాళ్లతో పాటు పెరుగుతూ వస్తుంది. ఫలితంగా జీవితంలో కాన్ఫిడెంట్ గా ఉండలేరు. కాబట్టి పిల్లలు ఎలా ఉన్నప్పటికీ వారి శరీరం గురించి కామెంట్స్ చేయొద్దు.

4. పోల్చకండి
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు చేసే పనులు, అలవాట్లను ఇతరులతో పోలుస్తూ ఉంటారు. మరి కొంతమంది ఇతర పోలికలతో వాటిని వివరిస్తారు. నిజానికి సరదాగా పిల్లలతో ఇలా చెబుతున్నామని అనుకుంటారు. కానీ అదే పిల్లల వ్యక్తిత్వం పై తీవ్ర ప్రభావం చూపి వారి ఆత్మవిశ్వాసాన్ని బలహీన పరుస్తుంది. తమ తల్లిదండ్రులు తమను అలా భావించడం వల్లే ఇలా ఉన్నామని ఫీల్ అవ్వడం మొదలు పెడతారు.

పిల్లల్లో ఉన్న చెడు అలవాట్లను మార్చాలి అనుకుంటే చెప్పే విధానంపై ముందుగా కాన్సన్ట్రేట్ చేయండి. ఒకవేళ పైన చెప్పుకున్న అలవాట్లు గనక పేరెంట్స్ కు ఉంటే మార్చుకుని ప్రేమగా, పాజిటివ్ పదాలను ఉపయోగించి వివరించండి. జీవితంలో సక్సెస్ అయిన వ్యక్తులను ఉదాహరణగా వారికి చూపించండి. అంతేగాని పిల్లలను ఇతర పిల్లలతో పోల్చొద్దు. అలాగే వారితో వ్యంగ్యంగా మాట్లాడొద్దు. దీనివల్ల వాళ్లలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏర్పడుతుంది. ఫలితంగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు