Depression: డిప్రెషన్ లో ఉన్నప్పుడు పొరపాటున కూడా ఈ 5 పనులు చేయొద్దు

డిప్రెషన్, ఒత్తిడి అనేవి ప్రస్తుతం ఈ డిజిటల్ యుగంలో తీవ్రమైన వ్యాధులుగా మారుతున్నాయి. డిప్రెషన్ సమస్య జనాల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఒక్కసారి డిప్రెషన్ బారిన పడితే ఇతర రోగాలు రావడానికి ఎక్కువ సమయం పట్టదు. ముఖ్యంగా డిప్రెషన్ కు గురైన వారు ఎక్కువగా నిరాశకు లోనై చేయకూడని పనులు, తప్పులు చేస్తారు. దీంతో ఆరోగ్యంపై తీవ్రమైన ఎఫెక్ట్ పడుతుంది. ఫలితంగా డిప్రెషన్ మరింత హానికరంగా మారుతుంది. ఒకవేళ డిప్రెషన్ సమస్యతో బాధపడితే, దాన్నుంచి కోలుకోవడానికి, బయట పడడానికి సైకాలజీ నిపుణులను సంప్రదించాలి. అలాగే కొన్ని ప్రత్యేక విషయాలపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఒంటరిగా ఉండకూడదు. ముఖ్యంగా తీవ్ర నిరాశలో ఉన్నప్పుడు ఈ ఐదు పనులు పొరపాటున కూడా చేయకపోవడమే మంచిది. మరి ఇంతకీ ఆ చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అతిగా తినడం
సాధారణంగా డిప్రెషన్ లో ఉన్నవారు చేసే పని అతిగా తినడం. ఒత్తిడి ఎక్కువవ్వడం వల్ల ఆకలి లేకపోయినా తింటూనే ఉంటారు. దీనివల్ల అనారోగ్యం బారిన పడతారు. శారీరకంగా, మానసికంగా అనేక వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది. నిద్రలేమి, అజీర్ణం, గ్యాస్ మొదలైన హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి తిండి విషయంలో జాగ్రత్తగా ఉండండి.

2. డ్రగ్స్ కు దూరంగా ఉండండి
డిప్రెషన్ తో బాధపడే చాలా మంది ఒత్తిడిని తట్టుకోలేక డ్రగ్స్ తీసుకోవడం మొదలు పెడతారు. ఎక్కువగా సిగరెట్ తాగడం లేదా మద్యం సేవించడం ప్రారంభిస్తారు. కానీ డిప్రెషన్ తో బాధపడుతున్నప్పుడు మధ్యపానానికి, ధూమపానానికి, డ్రగ్స్ కి దూరంగా ఉండాలి. లేదంటే ఒక్కసారి వాటికి అడిక్ట్ అయ్యారంటే డిప్రెషన్ ప్రమాదం మరింత పెరుగుతుంది.

- Advertisement -

3. ఒంటరిగా ఉండకండి
తీవ్ర ఒత్తిడికి లేదా నిరాశకు గురైనప్పుడు ఒంటరిగా, విచారంగా ఉంటారు. కానీ డిప్రెషన్ లో ఉన్నప్పుడు పొరపాటున కూడా ఇలాంటి పని చేయొద్దు. జనాలు ఉండే ప్రదేశంలో తిరుగుతూ ఉండండి. స్వచ్ఛమైన వాతావరణాన్ని ఫీల్ అవ్వండి. కుటుంబం లేదా స్నేహితులతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. మీ భావాలను అణచివేయొద్దు. మిమ్మల్ని అర్థం చేసుకునే వారి వద్ద ఓపెన్ గా మాట్లాడండి.

4. సోషల్ మీడియాకు దూరంగా ఉండండి
డిప్రెషన్ లో ఉన్న వ్యక్తులు ఎక్కువగా జనాలతో కలవకుండా మొబైల్, లాప్టాప్ లేదా వీడియో గేమ్ లకే ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారు. దీనివల్ల ఒత్తిడి మరింత పెరుగుతుంది. అలాగే డిప్రెషన్ లో ఉన్నప్పుడు దాన్ని మరింత పెంచే విధంగా సాంగ్స్ లేదా మ్యూజిక్ వింటూ ఉంటారు. దీనివల్ల మీ మానసిక పరిస్థితి మరింత అద్వాన్నంగా తయారవుతుంది. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ ఫ్రెండ్స్ తో లేదా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేయండి.

5. పడుకోవడం
డిప్రెషన్ సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళు ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు. కొంచెం సమయం దొరికినా సరే వెంటనే పడుకోవడానికి ఇష్టపడతారు. దీనివల్ల నిద్రలేమి సమస్య కూడా మొదలవుతుంది. కాబట్టి ఊరికే పడుకోకుండా అలా వాకింగ్ కు వెళ్లండి. వ్యాయామం, యోగ లేదా డాన్స్ చేయండి. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. సోషల్ మీడియా లేదా మిమ్మల్ని తప్పుదారి పట్టించే విషయాలకు దూరంగా ఉండండి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు