Yevade Subramanayam: ఒక సినిమా కొన్ని జీవితాలు

వైజయంతి మూవీస్ ఈ బ్యానర్ కి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి సూపర్ హిట్ సినిమా ఈ బ్యానర్ నుంచి వచ్చింది. ఈ బ్యానర్లో ఇలాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి. అయితే కొందరికి కొంతకాలం ఒక బ్యాడ్ ఫేజ్ నడుస్తుంది అని చెప్పొచ్చు. అలా వైజయంతి మూవీ బ్యానర్ కూడా కొంతకాలం పాటు బ్యాడ్ ఫేజ్ నడిచింది. ఒక టైం లో ఈ బ్యానర్ లో వచ్చిన సినిమాలేవి వర్కౌట్ అయ్యేవికావు. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చేసిన శక్తి సినిమా అయితే అశ్వని దత్ ను కోలుకోలేని లోతులోకి తోసేసింది. ఆ బ్యానర్ లో సినిమాలు తీయడం ఆపేద్దామని దాదాపు ఫిక్స్ అయ్యారు నిర్మాత అశ్వని దత్.

అదే టైంలో వాళ్ల పిల్లలు ప్రియాంక దత్, స్వప్న దత్ ఒక సినిమా డాడీ కథ మాకు బాగా నచ్చింది ఈ సినిమా తీసి ఆపేద్దాం అని అశ్విని దత్ ను రిక్వెస్ట్ చేశారు. సరే ఇన్ని కోట్లు పోయాయి కదా ఇంకో మూడు నాలుగు కోట్లు పోతే ఏముంది అనుకొని అశ్వని దత్ కూడా సరే అని ఆ సినిమాని చేయమన్నారు. అయితే అదే సినిమా స్వప్న సినిమాస్ బ్యానర్ లో నిర్మితమైంది. ఆ సినిమా పేరు ఎవడే సుబ్రహ్మణ్యం. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైజయంతి బ్యానర్ ముగిసిపోయింది కోలుకోవడానికి చాలా టైం పడుతుంది అనుకునే టైంలో ఒక అద్భుతమైన సినిమాను తెరకెక్కించారు దత్ సిస్టర్స్.

ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత మళ్లీ వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. కేవలం ఈ ఒక్క సినిమాతో చాలామంది జీవితాలు వెలుగులోకి వచ్చాయని చెప్పొచ్చు. ఈ సినిమాతోనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన దర్శకుడు దొరికాడు. అతని నాగ్ అశ్విన్. నాగ్ అశ్విన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు తను తీసిన మహానటి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలియంది కాదు. దాదాపు తెలుగు ప్రేక్షకులంతా సినిమాలు చూడటం మానేశారు అనుకున్న తరుణంలో ఒక గొప్ప సినిమా తీస్తే ఆడియన్స్ థియేటర్ కి పరుగులు పెడతారు అని నిరూపించిన సినిమా మహానటి.

- Advertisement -

అదే సినిమాతో మంచి గుర్తింపును పొందుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమాను పర్ఫామెన్స్ చూసిన తర్వాతే సందీప్ రెడ్డి వంగకి అర్జున్ క్యారెక్టర్ కి విజయ్ సరిపోతాడు అనిపించింది. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో విజయ్ దేవరకొండ రిషి పాత్రను పోషించిన విధానం చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సినిమాను కూడా అంత అద్భుతంగా తెరకెక్కించాడు నాగ్ అశ్విన్. అదే సినిమాతో పరిచయమైన నాగ్ అశ్విన్ నేడు ప్రపంచమంతా ఎదురుచూస్తున్న ఒక సినిమాకి దర్శకుడు అవడం విశేషం.

ఇకపోతే ఈ సినిమాతో స్వప్న సినిమాస్ బ్యానర్ తిరిగి వెనక్కు చూసుకోలేదు అని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించాయి ఈ బ్యానర్ నిర్మించిన సినిమాలు. ఇదే బ్యానర్ లో ఎవడే సుబ్రమణ్యం, మహానటి, జాతి రత్నాలు, సీతారామం వంటి అద్భుతమైన సినిమాలు వచ్చాయి.
అశ్విని దత్ కు అల్లుడు కూడా ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాతోనే దొరికాడు అని చెప్పొచ్చు. ఇంతమంది జీవితాలను వెలుగులోకి తీసుకొచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా వచ్చి నేటికీ సరిగ్గా తొమ్మిదేళ్లు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు