Anni Manchi Shakunamule: ఈ సినిమా హిట్ అయితే వీళ్ళందరికీ కమ్ బ్యాక్ వచ్చినట్టే

స్వప్న సినిమా బ్యానర్ లో ప్రియాంక దత్ నిర్మాతగా వైజయంతి మూవీస్ సమర్పణలో తెరకెక్కిన తాజా చిత్రం “అన్ని మంచి శకునములే”. ఈ సినిమాకు బి. నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. సంతోష్ శోభన్ హీరోగా నటించగా, మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. ఇక రాజేంద్రప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకారు జానకి, వెన్నెల కిషోర్, రమ్య సుబ్రహ్మణ్యన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మిక్కి. జె. మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ డీసెంట్ గా ఉండి మెప్పిస్తుంది. లవ్, కామెడీ& ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా మే 18న విడుదల అవుతుంది. ట్రైలర్ చూస్తుంటే అందరికి తెలిసిన కథే అయినా ఫ్రెష్ గా కనిపిస్తుంది. స్క్రీన్ ప్లే క్లిక్ అయితే “అన్ని మంచి శకునములే” సినిమాతో మూవీ యూనిట్ లో చాలా మంది కమ్ బ్యాక్ ఇవ్వచ్చు. వెళ్లేవరంటే ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న సంతోష్ శోభన్ కి ఏక్ మినీ కథ తర్వాత హిట్ లేదు. రీసెంట్ గా వచ్చిన కళ్యాణం కమనీయం, శ్రీదేవి శోభన్ బాబు డిజాస్టర్లయ్యాయి. అందువల్ల శోభన్ కి ఇప్పుడు హిట్ ఖచ్చితంగా కావాలి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మాళవిక నాయర్ కి అందరికంటే ఎక్కువగా హిట్ అవసరం ఉంది. కెరీర్ మొదట్లో బాగానే మంచి సినిమాలు చేసిన ఇప్పుడు మాత్రం తన పరిస్థితి చాలా బ్యాడ్ గా ఉంది. తాను ఈ మధ్య నటించిన ఒరేయ్ బుజ్జిగా, థ్యాంక్ యూ, రీసెంట్ గా వచ్చిన “ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి” సినిమాలతో హ్యాట్రిక్ ప్లాప్ లు అందుకుంది. ఇప్పుడు అన్ని మంచి శకునములే సినిమాతో మంచి హిట్ కొట్టి తన పరువు కాపాడుకోవాలని చూస్తుంది.

- Advertisement -

ఇక ఆ తర్వాత ఈ సినిమా డైరెక్టర్ నందిని రెడ్డి, “ఓ బేబి” తో యావరేజ్ హిట్ ని అందుకోగా, ఆ సినిమా కొరియన్ సినిమా రీమేక్ అవడంతో డైరెక్టర్ కి అంతగా పేరు రాలేదు. పైగా సినిమాలో ఎక్కువ క్రెడిట్ సమంత నే కొట్టేసింది. రీసెంట్ గా పిట్ట కథలు అనే వెబ్ సిరీస్ లో ఒక పార్ట్ ని డైరెక్ట్ చేసింది. అది కూడా అంతగా జనాదరణ కు నోచుకోలేదు. కాబట్టి ఈ సినిమాతో గట్టి హిట్ కొట్టి అందరి నోళ్లు మూయించాలని చూస్తుంది నందిని రెడ్డి. ఇక రామబాణం తో రీసెంట్ గా డిజాస్టర్ ను అందుకున్న మిక్కీ జె. మేయర్ కూడా అన్ని మంచి శకునములే మూవీ ద్వారా హిట్ కొట్టి మళ్ళీ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు. మరి వీరందరూ ఫామ్ లోకి వస్తారో లేదో తెలియాలంటే మే 18 వరకు వెయిట్ చేయాల్సిందే.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు