Arvindh Krishna : ఈ హీరో గుర్తున్నాడా.. ?

దర్శకరత్న దాసరి నారాయణ రావు డైరెక్షన్ లో వచ్చిన యంగ్ ఇండియా సినిమాతో పరిచయమైన నటుడు అరవింద్ కృష్ణ. అయితే ఈ సినిమా ఆశించినంత విజయం సాధించకపోవటం వల్ల అరవింద్ కృష్ణకి పెద్దగా గుర్తింపు లభించలేదు. ఆ తరువాత అరవింద్ కృష్ణ ఇట్స్ మై లవ్ స్టోరీ అనే సినిమాలో హీరోగా చేసాడు. మధుర శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అరవింద్ కృష్ణకి తొలి హిట్ ని అందించింది. అంతేకాదు ఈ సినిమాకి గాని అరవింద్ కృష్ణకి సైమా బెస్ట్ డెబ్యూ హీరోగా నామినేట్ కూడా అయ్యాడు.

అయితే ఇట్స్ మై లవ్ స్టోరీ సినిమా మినహా అరవింద్ కృష్ణ కెరీర్ లో హిట్స్ ఏమి లేవు. ఈ సినిమా తరువాత అరవింద్ చేసిన ఏ సినిమా కూడా సరిగా ఆడలేదు. దాంతో తన కెరీర్ కి పెద్ద బ్రేక్ వచ్చింది. ఇక హీరోగా నిలదొక్కుకోవడం కష్టం అనుకోని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడం మొదలు పెట్టాడు. ఆకాష్ పూరి హీరోగా పరిచమైన ఆంధ్రాపోరి సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో నటించాడు అరవింద్. ఆ తరువాత ప్రముఖ దర్శకుడు వీరు పోట్ల దర్శకత్వంలో సునీల్ హీరోగా వచ్చిన ఈడు గోల్డ్ ఎహే సినిమాలో విలన్ గా నటించాడు. కానీ ఈ సినిమా కూడా అరవింద్ కి హిట్ ఇవ్వలేకపోయింది.

ప్రస్తుతం అరవింద్ కృష్ణ హీరోగా “ఏ మాస్టర్ పీస్ ” అనే సినిమా చేస్తున్నాడు. డైరెక్టర్ సుకు పూర్వజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, సూపర్ హీరో జానర్ లో ఉండబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన సూపర్ హీరో లుక్ పోస్టర్ ని ఇటీవలనే విడుదల చేసింది మూవీ టీం. సూపర్ హీరో గెటప్ లో అరవింద్ కృష్ణ స్టీల్ ఇంప్రెస్సివ్ గా ఉంది. చాలా గ్యాప్ తరువాత అరవింద్ చేస్తున్న సినిమా అవడంతో గతంలో తనతో పని చేసిన యాక్టర్స్ అరవింద్ కి విషెస్ చెప్తూ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కటౌట్ పరంగా బాగున్నా, సక్సెస్ లేని ఈ యంగ్ హీరోని మరి జనాలు సూపర్ హీరోగా అంగీకరిస్తారో లేదో చూడాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు