Jathi ratnalu : అనుదీప్ పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది.

పిట్టగోడ సినిమాతో దర్శకుడిగా పరిచమైన అనుదీప్. జాతి రత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామ కృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా లక్డౌన్ తరువాత రిలీజై బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కేవలం 4కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 65కోట్ల వసూళ్ళని రాబట్టింది.

జాతి రత్నాలు సినిమా హిట్ తో, ఆ సినిమాకి పని చేసిన అందరి జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో నటుడిగా నవీన్ పోలిశెట్టి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన ఫరియా అబ్దుల్లా కూడా చిట్టి పేరుతో బాగా పాపులరై మంచి సినిమా అవకాశాలు దక్కించుకుంది. అయితే ఈ అమ్మాయి హైట్ ఎక్కువ ఉన్న కారణంగా పెద్ద సినిమాల్లో అవకాశాలు మాత్రం ఎక్కువగా రావట్లేదు

ఇక అనుదీప్ విషయానికొస్తే, జాతిరత్నాలు లాంటి క్లీన్ ఎంటర్టైనర్ తీసి, ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో తరువాతి అనుదీప్ సినిమాకి ప్రొడ్యూసర్స్ క్యూ కట్టారు. మాతో సినిమా చేయండి అంటే మాతో సినిమా చేయండి.. అంటూ అనుదీప్ వెంటపడ్డారు అయితే ఇదంతా జాతి రత్నాలు రిలీజైన మొదటి రోజుల్లో సంగతి. అనుదీప్ జాతి రత్నాలు సినిమా తరువాత ప్రిన్స్ అనే తెలుగు, తమిళ్ బై లాంగ్వేజికల్ సినిమా చేసాడు. తమిళ్, తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న శివ కార్తికేయన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దాంతో అనుదీప్ కెరీర్ ఒక్కసారిగా తలక్రిందులైంది. ఒకప్పుడు ఏ ప్రొడ్యూసర్స్ అయితే అడ్వాన్స్ లు ఇస్తాం అంటూ వెంటపడ్డారో ఇప్పుడు కనీసం అనుదీప్ పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇదంతా కాయిన్ కి ఒకవైపు మాత్రమే మరో వైపు చూసుకుంటే ప్రిన్స్ సినిమా తరువాత కూడా అనుదీప్ ఫస్ట్ డే ఫస్ట్ షో లాంటి కొన్ని సినిమాలకి రచన సహకారం అందించారు. రీసెంట్ సూపర్ హిట్టయిన బలగం సినిమాకి సంబంధించి అనుదీప్ స్క్రిప్ట్ పరంగా చాలా హెల్ప్ చేసాడంట. ఈ విషయాన్ని స్వయంగా బలగం డైరెక్టర్ వేణునే స్టేజ్ పై చాలా సార్లు చెప్పాడు. అలాగే సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న అన్నీ మంచి శకునములే సినిమాకి కూడా ఆయన కథ విషయంలో మార్పులు, చేర్పులు చేసారంట. కాకపోతే వీటివల్ల అనుదీప్ కి ఎలాంటి రెకాగ్నేషన్ రాలేదు. అయితే అనుదీప్ ప్రస్తుతం తన సొంత సినిమా పనుల్లో బిజీ గా ఉన్నడంట. తెలుగు హీరోలు ఎవరు ప్రస్తుతం ఖాళీ లేకపోవడంతో అనుదీప్ మళ్ళీ తమిళ్ హీరోల వైపు చూస్తున్నాడని టాక్.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు