HBD Hrithik Roshan : హృతిక్ రోషన్ కు చిన్నప్పటి నుంచే ఆ వ్యాధి… 35 ఏళ్ల దాకా పట్టి పీడించింది

HBD Hrithik Roshan :  బాలీవుడ్ ‘గ్రీక్ గాడ్’ హృతిక్ రోషన్ 49వ పుట్టినరోజు నేడు. 1974 జనవరి 10న జన్మించిన హృతిక్ రోషన్ ఈరోజు తన అభిమానుల నుంచి, పలువురు సినీ ప్రముఖుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా హృతిక్ గురించి, ముఖ్యంగా ఆయనను చిన్నతనం నుంచే ఇబ్బంది పెడుతున్న జబ్బు గురించి చాలా మంది తెలుగు సినీ లవర్స్ కు పెద్దగా తెలియదు. మరి ఇంతకీ ఆయనను అంతగా పీడించిన ఆ జబ్బు ఏంటి అనే వివరాల్లోకి వెళ్తే…

ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు రాకేష్ రోషన్ కుమారుడు హృతిక్. 2000 సంవత్సరంలో ‘కహో నా ప్యార్ హై’ చిత్రంతో హీరోగా తన సినీ జీవితాన్ని ప్రారంభించిన ఆయన, తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఓవర్ నైట్ స్టార్‌ అయ్యాడు. ఆ తరువాత ఈ హీరో వెనుదిరిగి చూసుకోలేదు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. టాలీవుడ్ లోనూ హృతిక్ రోషన్ అంటే పడి చచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తన ఫిట్‌నెస్, అద్భుతమైన డ్యాన్స్ స్కిల్స్ తో మ్యాజిక్ చేసే హృతిక్ ప్రపంచంలోని టాప్ 10 అందమైన నటుల జాబితాలో చోటు దక్కించుకుని చరిత్రను క్రియేట్ చేశారు.

హృతిక్ రోషన్ కు చిన్నప్పటి నుండి ఈ వ్యాధి…
ఇక అసలు విషయంలోకి వెళ్తే… ఖాన్లను పోటీగా నిలిచి, బాలీవుడ్ వాళ్ళకంటే ఎక్కువ క్రేజ్ ను సంపాదించి, తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు హృతిక్‌. అయితే చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు చేసిన హృతిక్ రోషన్‌కు చిన్నప్పటి నుంచి నటనపై పట్టు ఉంది. హీరోగా ఎదగాలని అప్పటి నుంచే అనుకున్నా, అనారోగ్యం కారణంగా తన కలను సాకారం చేసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

- Advertisement -

నిజానికి హృతిక్‌కి చిన్నప్పటి నుంచి నత్తి సమస్య ఉండడంతో స్పష్టంగా మాట్లాడలేకపోయేవాడట. 2009లో ఫరా ఖాన్ షో ‘తేరే మేరే బీచ్ మే’లో హృతిక్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. తనకు 6 ఏళ్ల నుంచి ఈ వ్యాధి ఉందని, దీనివల్ల పిల్లలు తనను ఎగతాళి చేసేవారని, అందుకే స్కూల్ కు కూడా సరిగ్గా వెళ్లే వాడిని కాదని చెప్పుకొచ్చాడు.

35 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆ జబ్బు తనను పీడించిందని, దీనివల్ల సినిమా స్క్రిప్ట్‌లను సరిగ్గా చదవలేకపోవడంతో ఒకానొక సమయంలో తన సినీ కెరీర్ ఫై ఎఫెక్ట్ పడిందని, తరువాత స్పీచ్ థెరపీ తీసుకోవడం వల్ల దాని నుంచి బయట పడ్డానంటూ చెప్పుకొచ్చాడు హృతిక్. సరిగ్గా మాట్లాడలేకపోయిన ఒక అబ్బాయి ఇప్పుడు బాలీవుడ్ ను ఏలుతాడనికి ఎవరూ ఊహించి ఉండరు కదా !

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు