Keerthy Suresh: మహానటి కెరియర్ ముగిసినట్టేనా.. కారణం..?

Keerthy Suresh: మహానటి సినిమాతో జాతీయ అవార్డును అందుకున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో పరవాలేదు అనిపించుకున్న ఈమె.. మహానటి సినిమా తర్వాత అంతకుమించి పాపులారిటీ దక్కించుకుంది. ముఖ్యంగా వరుస అవకాశాలు అందుకొని తెలుగులో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఇకపోతే టాలీవుడ్ సినిమాలతోనే కెరియర్ గ్రాఫ్ పీక్స్ కు చేరేలా చేసుకున్న ఈ మలయాళ ముద్దుగుమ్మ.. వరుసగా సినిమాలు చేసి సక్సెస్ అందుకుంది. అయితే ఆ మధ్య బొద్దుగా ఉండడం వల్ల అవకాశాలు రాకపోవడంతో తన లుక్స్ ని కూడా పూర్తిగా మార్చుకొని.. స్లిమ్ లుక్ లో కనిపించి సర్ప్రైజ్ చేసింది.

మారిన కొత్త లుక్ తో పాటు గ్లామర్ విషయంలో కూడా కాస్త లిమిట్స్ దాటింది కీర్తి సురేష్. ఇక తెలుగులో మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమా చేసిన ఈమె.. నాని సరసన దసరా సినిమా చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వచ్చిన చిరంజీవి భోళా శంకర్ మాత్రం షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో చిరంజీవికి చెల్లి పాత్రలో చేసిన కీర్తి సురేష్ సినిమా ఫ్లాప్ అవడంతో కెరీయర్ లో కాస్త డీలా పడిందని చెప్పవచ్చు. ఆ తర్వాత తెలుగులో ఈమెకి ఒక్క ఆఫర్ కూడా రావట్లేదు. హీరోయిన్గా ఎలాంటి పాత్ర ఇచ్చినా… చేసే ప్రతిభ తన సొంతమైనా సరే కీర్తి సురేష్ కి తెలుగులో అవకాశాలు పూర్తిగా కరువయ్యాయని చెప్పవచ్చు.

తెలుగులో అవకాశాలు రాకపోయినా తమిళ్లో మాత్రం దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ ఏడాది నాలుగు సినిమాలు ఈమె చేతిలో ఉన్నాయి. కోలీవుడ్లో బిజీగా ఉన్న కీర్తి సురేష్ కి టాలీవుడ్ నుంచి ఒక్క ఆఫర్ కూడా రాకపోవడం గమనార్హం. మరి కీర్తి సురేష్ అప్పుడే బోర్ కొట్టేసిందా లేక ఆమె చేసే పాత్రలు రావట్లేదా అన్నది తెలియాల్సి ఉంది . వాస్తవానికి తెలుగులో హీరోయిన్స్ కొరత ఉందని అంటారు కానీ ఇక్కడ సినిమాలు చేయాలని ఆసక్తి చూపిస్తున్న హీరోయిన్స్ ను మాత్రం పట్టించుకోరు. తెలుగులో వరుస సినిమాలు చేస్త చూడాలని అభిమానులు కోరుతున్నా.. తెలుగు దర్శక నిర్మాతలు మాత్రం అవకాశాలు ఇవ్వడం లేదు. ముఖ్యంగా కంటెంట్ ఉన్న సినిమాలకి కీర్తి సురేష్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

- Advertisement -

అందుకే కొత్త దర్శకులు ఈమెను ప్రిఫర్ చేస్తున్నారు..అలా దసరా సినిమాలో వెన్నెల పాత్ర చేసి నటిగా తానేంటో నిరూపించుకున్న కీర్తి సురేష్ కి ఇప్పుడు తెలుగులో అవకాశాలు రాకపోవడం నిజంగా బాధాకరమని చెప్పాలి. ఇకపోతే ఇలాగే ఈమెకు అవకాశాలు రాకపోతే తెలుగులో ఇమె కెరియర్ ముగిసినట్టే అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇకనైనా కల్పించుకొని అవకాశాలు తెచ్చుకోవాలని కూడా కోరుతున్నారు ఫ్యాన్స్.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు