Raghavendra Rao: శ్రీదేవి మొదలు ఏ ఒక్క హీరోయిన్ అందంగా లేదు.. కానీ..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో దిగ్గజ డైరెక్టర్ గా పేరుపొందిన డైరెక్టర్ రాఘవేంద్రరావు గురించి ఎంత చెప్పినా తక్కువే.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఎన్నో కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు.. సీనియర్ హీరోలలో దాదాపుగా అందరి హీరోలతో డైరెక్టర్ రాఘవేంద్రరావు ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు.. ముఖ్యంగా డైరెక్టర్ రాఘవేంద్రరావు హీరోయిన్లను చూపించినంత అందంగా .. మరే దర్శకులు కూడా చూపించలేరని చెప్పవచ్చు..

హీరోయిన్ల అందాలను పూలు, పండ్ల తో అభివర్ణిస్తూ చాలా హాట్ గా చూపిస్తూ ఉండడం కేవలం రాఘవేంద్రరావుకు మాత్రమే చెల్లుతుంది.. తాజాగా ఈ డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను హీరోయిన్ లను అంత అందంగా చూపించడం వెనుక తనకు ఒక కిటుకు ఉందంటూ తెలియజేశారు. గతంలో డైరెక్టర్ రాజమౌళి కూడా ఒకానొక సందర్భంలో రాఘవేంద్రరావు హీరోయిన్లను అంత అందంగా చూపించడం గురించి మాట్లాడారు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు గమాట్లాడుతూ.. రాజమౌళి నేను మరి కొంతమంది దర్శకులు ఒక చర్చలో పాల్గొన్నప్పుడు.. రాజమౌళి తనతో పాటు చాలామంది దర్శకుల హీరోయిన్లను అందంగా చూపించాలని ప్రయత్నించారు కానీ అది సాధ్యపడలేదని తెలిపారు రాఘవేంద్రరావు.

అయితే దీని వెనక సీక్రెట్ ని రాజమౌళి అడగగా.. సరదాగా తాను ఒక మాట చెప్పానని తెలిపారు. అదేమిటంటే నేను హీరోయిన్ల ముఖం వంక చూడనని.. ఎందుకంటే ఏ ఒక్క హీరోయిన్ కూడా పూర్తిగా అందంగా ఉండదు.. కొన్నిసార్లు ఒకరి నవ్వు బాగుంటుంది.. మరొకరికి ముక్కు బాగుంటుంది.. మరొకరికి కళ్ళు బాగుంటాయి.. అంతేకానీ పూర్తిగా అందంగా ఎవరూ కనిపించరని తెలిపారు.. వాళ్ల మైనస్ ను సైతం దాచిపెడుతూ అందాన్ని హైలైట్ గా చేయడమే డైరెక్టర్ల పని అంటూ తెలియజేశారు రాఘవేంద్రరావు..

- Advertisement -

దివంగత నటి శ్రీదేవి నడుము గురించి మాట్లాడుతూ.. ఆమె నడుము కడవ లాగా ఉంటుంది కనుక ఒక సాంగ్ లో ఆమె నడుము మీదే పాటను చేసి చూపించామంటూ తెలిపారు.. గతంలో ఎక్కువగా హీరోయిన్లను పండ్ల తో పోల్చి చూపించడం వల్ల తన మీద చాలా దారుణమైన కామెంట్స్ కూడా వచ్చాయని తెలిపారు.. అప్పట్లో కత్రినా కైఫ్ వంటి హీరోయిన్లు కూడా పండ్లతో యాడ్స్ చేస్తున్నారని తెలిపారు రాఘవేంద్రరావు

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు