HBD Siddharth : సిద్ధార్థ్ హీరోగా చేసిన ఆ మూవీ 9 భాషల్లో రీమేక్… 19 ఏళ్ళు దాటినా ఆ రికార్డును బ్రేక్ చేసినోడే లేడు

HBD Siddharth : మామూలుగా ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఒకటి లేదా రెండు భాషల్లో రీమేక్ అవుతుంది. కానీ సిద్ధార్థ హీరోగా నటించిన ఓ మూవీ మాత్రం ఏకంగా 9 భాషల్లో రీమేక్ అయ్యి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటిదాకా స్టార్ హీరోలు సైతం ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోయారు. ఈరోజు సిద్ధార్థ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఖాతాలో ఆ అద్భుతమైన రికార్డును వేసిన ఆ మూవీ ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం.

లవర్ బాయ్ సిద్ధార్థ హీరోగా, త్రిష హీరోయిన్ గా నటించిన రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా. సునీల్, శ్రీహరి, అర్చన కీలక పాత్రలు పోషించిన ఈ మూవీని ఎమ్మెస్ రాజు నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, ప్రభుదేవా ఈ మూవీతో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. హిందీ మూవీ మైనే ప్యార్ కియా నుంచి ప్రేరణ పొందిన ఈ మూవీ కల్ట్ మూవీగా చరిత్రను సృష్టించింది. 2005లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీలో సంతోష్ అనే పాత్రలో కనిపించాడు సిద్ధార్థ్. లండన్ నుంచి తన కజిన్ పెళ్లికి వచ్చిన ఎన్ఆర్ఐ సంతోష్… సిరి అనే పల్లెటూరి అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను దక్కించుకోవడానికి, ప్రేయసిని పెళ్లాడడానికి ఆయన ఎలాంటి ఛాలెంజెస్ ను ఎదుర్కొన్నాడు అనేదే మూవీ కథ. ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఏకంగా 9 భాషల్లో రీమేక్ కాగా, ఇప్పటిదాకా ఆ రికార్డును ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు.

నువ్వొస్తానంటే నేనొద్దంటానా రీమేక్ ఈ భాషల్లోనే…

ఈ మూవీ హిందీలో రామయ్యా వస్తావయ్యా అనే పేరుతో 2013లో రీమేక్ అయింది. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ హిందీ వెర్షన్ కు కూడా ప్రభుదేవానే దర్శకత్వం వహించారు. తమిళంలో ఉనక్కుమ్ ఎనక్కుమ్ పేరుతో 2006లో జయం రవి, త్రిష హీరో హీరోయిన్లుగా వచ్చింది. కన్నడలో నీనెల్లో నానల్లె (2006), బెంగాలీలో ఐ లవ్ యు (2007), మణిపురిలో నింగోల్ థజబాగా ( 2007), ఒడియాలో సునా చదేయ్ మో రూపా చదేయ్ (2009), పంజాబీలో తేరా మేరా కి రిష్తాగా ( 2009), బెంగాలీలో నిస్సాష్ అమర్ తుమీగా బంగ్లాదేశీ (2010), 2010 నేపాలీ భాషల్లో ఈ మూవీ రీమేక్ అయ్యింది.

- Advertisement -

అవార్డుల పంట

2005లో రిలీజ్ అయిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీ ఏకంగా ఐదు విభాగాల్లో అప్పట్లోనే నంది అవార్డులు గెలుస్తుంది. 9 ఫిల్మ్ ఫేర్ అవార్డులను దక్కించుకుంది.

ఎక్కువగా రీమేక్ అయినా సినిమాలు ఇవే…

ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీ అత్యధిక భాషల్లో రీమేక్ అయిన ఇండియన్ మూవీగా చరిత్రను సృష్టించింది. మోహన్ లాల్ హీరోగా నటించిన దృశ్యం మూవీ 8 భాషల్లో రీమేక్ కాగా, బాలీవుడ్ మూవీ డాన్ 5 భాషల్లో రీమేక్ అయింది. భారతదేశంలోని ఏ మూవీ కూడా నువ్వొస్తానంటే నేనొద్దంటానా రికార్డును బ్రేక్ చేయలేకపోయింది. ఈ మూవీ రిలీజ్ అయి 19 ఏళ్ళు దాటుతున్నప్పటికీ ఇంకా ఆ రికార్డు అలాగే పదిలంగా ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు