HBD Siddharth : కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్… సిద్ధార్థ్ కెరీర్లో టాప్ 5 వివాదాలు ఇవే

HBD Siddharth : యంగ్ హీరో సిద్ధార్థ్ ను ఒకప్పుడు లవర్ బాయ్ గా పిలుచుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయనను కాంట్రవర్సీ కింగ్ అంటున్నారు. తరచుగా సోషల్ మీడియా వేదికగా ఆయన చేసే ట్వీట్లు, కామెంట్స్ వివాదాలకు కారణం అవుతున్నాయి. అందుకే సిద్ధార్థ్ అంటే వివాదం అన్నట్టుగా మారింది పరిస్థితి. అయినప్పటికీ ఈ హీరో ఏమాత్రం వెనక్కి తగ్గడు. ఎవరేమన్నా సరే కుండ బద్దలు కొట్టినట్టుగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తాడు. ఈరోజు సిద్ధార్థ బర్త్ డే సందర్భంగా ఇప్పటిదాకా ఆయనను ఇబ్బందుల్లో పడేసిన టాప్ ఫైవ్ కాంట్రవర్సీలు ఏంటో తెలుసుకుందాం.

1. సైనా నెహ్వాల్ వివాదం

ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ను ఉద్దేశిస్తూ సిద్ధార్థ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం లేపింది. 2022లో ప్రధాన మంత్రి మోడీ పంజాబ్ పర్యటన సమయంలో ఆయనపై జరిగిన దాడిని ఉద్దేశిస్తూ సైనా నెహ్వాల్ ట్వీట్ చేసింది. ప్రధానికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి అన్నట్టుగా సైనా చేసిన ట్వీట్ కు సిద్ధార్థ సబ్టిల్ కాక్ చాంపియన్ ఆఫ్ ది వరల్డ్… మనల్ని రక్షించేవారు ఉన్నందుకు దేవుడికి ధన్యవాదాలు చెబుతున్నాను అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో ప్రముఖులతో పాటు నెటిజన్లు కూడా సిద్ధార్థ్ పై దుమ్మెత్తి పోశారు. తరువాత ఈ హీరో సారీ చెప్పడంతో పాటు తను జోక్ చేశానని కవర్ చేశాడు.

2. జుంటా కామెంట్

బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ తో పోలుస్తూ ఓ నెటిజన్ సిద్ధార్థ పై సెటైరికల్ గా ట్విట్ చేశాడు. అయితే సిద్ధార్థ్ తనను స్వర భాస్కర్ తో పోల్చిన ఆ వ్యక్తిని హిందీ జుంటా అంటూ సంబోధించారు. హిందీ మాట్లాడే జుంటా నన్ను సౌత్ స్వర భాస్కర్ అని పిలుస్తున్నాడు. అయితే నేను ఎప్పుడైనా ఎలాగైనా స్వరలాగా ఉండాలంటే హ్యాపీగా ఉంటానని, తనొక అద్భుతమైన క్యూటీ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో సిద్ధార్థ ట్వీట్ మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉందంటూ సోషల్ మీడియాలో ఆయనపై విరుచుకుపడ్డారు.

- Advertisement -

3. సమంతపై సెటైర్

సమంత తన మాజీ భర్త నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్నట్టు ప్రకటించిన వెంటనే సిద్ధార్థ్ నుంచి ఊహించని విధంగా ఓ ట్వీట్ వచ్చి పడింది. నేను స్కూల్లో టీచర్ నుంచి నేర్చుకున్న మొదటి పాఠాలలో ఒకటి చీటర్స్ ఎప్పుడూ అభివృద్ధి చెందలేరు? మరి మీరేం నేర్చుకున్నారు అంటూ ట్వీట్ చేశాడు. ఆయన అందులో సమంతను ఇన్వాల్వ్ చేయకపోయినా అతని ఉద్దేశం మాత్రం అదేనని టాక్ నడిచింది.

4. ప్రధాని మోదీ భద్రతపై…

ప్రధాని మోడీ పంజాబ్ పర్యటన సమయంలో జరిగిన దాడి గురించి సిద్ధార్థ్ అడిగిన ప్రశ్న సంచలనంగా మారింది. ప్రధాని మోడీ పంజాబ్లో ఉన్నడని మనకెలా తెలుస్తుంది? ఇదేదో డ్రామాలా ఉంది అన్నట్టుగా సిద్ధార్థ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా బిజెపికి ఎంపీ తేజస్వి సూర్యను ఉగ్రవాది అజ్మల్ కసబ్ తో పోల్చి మరోసారి విమర్శలకు గురయ్యాడు.

5. యానిమల్ మూవీపై కామెంట్స్

ఇప్పటిదాకా చెప్పుకున్నవన్నీ ఒక ఎత్తయితే ఇప్పుడు చెప్పుకునే యానిమల్ కాంట్రవర్సీ మరొక ఎత్తు. తను నటించిన చిన్నా మూవీ డిస్టర్బింగ్ గా ఉందని కొంత మంది కామెంట్స్ చేశారని, కానీ యానిమల్ లాంటి మూవీని మాత్రం హ్యాపీగా చూశారంటూ మరోసారి వార్తల్లో నిలిచారు సిద్ధార్థ్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు