HBD Chiyaan Vikram : రానాకి విక్రమ్ సారీ… వీరిద్దరి మధ్య అసలు గొడవ ఏంటో తెలుసా?

HBD Chiyaan Vikram : కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కు టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తారు విక్రమ్. సినిమా కోసం బరువు తగ్గుతూ పెరుగుతూ, రకరకాల మేకోవర్లతో సరికొత్త ప్రయత్నాలు చేసే హీరోలలో ఎప్పుడూ ముందుండే విక్రమ్ వివాదాల విషయంలో కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటారు. ఇక రానాతో విక్రమ్ కి జరిగిన గొడవను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈరోజు విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా అసలు వీళ్ళిద్దరికీ మధ్య జరిగిన గొడవ ఏంటి? ఎందుకు వచ్చింది? అనే ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలుసుకుందాం…

ఇదే వివాదం

బాహుబలి మూవీ తర్వాత రానా క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. లీడర్ మూవీతో టాలీవుడ్ లోకి దగ్గుబాటి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రానాకు బాహుబలి మూవీ తిరుగులేని సక్సెస్ ను ఇచ్చింది. అయితే బాహుబలి కంటే ముందే రానా రోహన్ సిప్పితో కలిసి దమ్ మారో దమ్, ఆర్జీవితో డిపార్ట్మెంట్ అనే సినిమాలలో నటించాడు. ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయితే 2013లో విక్రమ్ డేవిడ్ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. అదే టైంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు విక్రమ్.

ఆ ఇంటర్వ్యూలో విక్రమ్ కు దక్షిణాది నటులు బాలీవుడ్ లో ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారు అనే ప్రశ్న ఎదురయింది. ఆ ప్రశ్నకు చాలా క్యాజువల్ గా విక్రమ్ రానాని ఉదాహరణగా చూపిస్తూ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. రానాను చూడండి. తను తెలుగు ఇండస్ట్రీలో యాక్టింగ్ మొదలు పెట్టి ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళాడు. అలాగని ఆయన దక్షిణాదిన ఏమీ సాధించలేదు. కానీ బాలీవుడ్ లో పని చేయాలంటే నేను ఇక్కడ ఉన్నవన్నీ వదిలేసుకొని అక్కడికి వెళ్లాలి అంటూ రానా రెండు పడవల ప్రయాణం బెడిసి కొట్టిందనే అభిప్రాయాన్ని విక్రమ్ బయట పెట్టారు. అంటే రానాకు చెప్పుకోవడానికి ఇటు మాతృ భాష అయిన టాలీవుడ్లో, అటు బాలీవుడ్ లో కూడా ఏం సాధించలేకపోయాడని కామెంట్ చేశారు విక్రమ్.

- Advertisement -

రానా స్ట్రాంగ్ కౌంటర్

ఇంకేముంది రానా ఊరుకుంటాడా స్ట్రాంగ్ కౌంటర్ తో సోషల్ మీడియా వేదికగా ఇచ్చి పడేసాడు. నా గురించి ఆలోచించడం మానేసి ముందు నీ కెరీర్ పై నువ్వు దృష్టి పెట్టు అంటూ ఫైర్ అయ్యాడు రానా. ప్రియమైన విక్రమ్ నువ్వు కొన్ని మీడియా సంస్థలలో నన్ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ చూసాను. దాదాపు 10 డిజాస్టర్లకు దగ్గరవుతున్న నువ్వు ముందుగా నీ కెరీర్ పై దృష్టి పెట్టడం మంచిది. నటుడుగా నా వయస్సు ఇంకా కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమే. కానీ నువ్వు 25 సంవత్సరాలకి దగ్గరవుతున్నావు. నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తున్నట్టుగా నువ్వు నీ గురించి మాత్రమే ఆలోచించుకో. ఈ విషయంపై ఇక ఆలోచించకు. నేను నువ్వు నటించిన కొన్ని సినిమాలకు పెద్ద ఫ్యాన్ ని అంటూ కౌంటర్ గా ట్వీట్ వేశాడు. అప్పట్లో వీళ్లిద్దరి మధ్య జరిగిన ఈ వివాదం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ తర్వాత ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకుని వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు