HBD Siddharth : సిద్ధూ ప్రయాణం.. అసిస్టెంట్ నుండి హీరోదాకా..

HBD Siddharth : సినిమాల్లో కొంతమంది నటులు తక్కువ సినిమాలు చేసినా ఎక్కువ మందికి రీచ్ అవుతారు. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. కొంత మంది హీరోలు ఎప్పుడు చూసినా ఒకేలా ఉంటూ, ఎంతో జాలిగా పక్కింటి కుర్రాడు, అమాయకుడు ఇలాంటి ట్యాగ్ లకి సరిగ్గా సరిపోయే హీరోల్లో సిద్ధార్థ్ ఒకరు. నిజానికి టాలీవుడ్ లో నాని, నిఖిల్ లాంటి హీరోల కన్నా ముందు మిడిల్ క్లాస్ కుర్రాడు, క్లాస్ హీరో అన్న టైటిల్స్ కి జస్టిఫై చేసిన హీరో ఇతను. బొమ్మరిల్లు సిద్ధార్థ్ గా చేరువైన సిద్ధార్థ్ గత కొన్నాళ్లుగా తెలుగు ప్రేక్షకులకి కాస్త దూరమైనా, మూవీ లవర్స్ మైండ్ లో సిద్ధూ గా అలాగే నిలిచిపోయాడు. ఈరోజు సిద్ధార్థ్ (ఏప్రిల్ 17) బర్త్ డే. ఈ సందర్బంగా filmify తరపున తనకి బర్త్ డే విషెస్ ని తెలియచేస్తూ సిద్ధార్థ్ హీరోగా ఎదిగిన తీరుపై ఓ లుక్కేద్దాం.

అసిస్టెంట్ డైరెక్టర్ గా స్టార్ చేసి హీరోగా..

టాలీవుడ్ లో డైరెక్టర్ అవుదామని వచ్చి హీరోలుగా మారిన హీరోల్లో సిద్ధార్థ్ (HBD Siddharth) ఒకరు. ఎడ్యుకేషనల్ ఫ్యామిలికి చెందిన సిద్ధార్థ్ తన డిగ్రీ పూర్తైన తరువాత మణిరత్నం దగ్గర అసిస్టెంట్ గా చేరాడు. అమృత సినిమాకి అసోసియేట్ గా చేసిన సిద్ధార్థ్, ఆ తర్వాత శంకర్ దగ్గర కూడా బాయ్స్ సినిమాకి అసిస్టెంట్ గా చేసాడు. కానీ అనూహ్యంగా అదే సినిమాలో హీరోగా మారిపోయాడు. అయితే ఈ సినిమాతో ప్రశంసలు లభించాయిగాని సిద్ధార్థ్ కి అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఇక ఆ తర్వాత మళ్ళీ మణిరత్నం యువ సినిమాకి అసోసియేట్ గా చేస్తూనే ఆ సినిమాలో మూడో హీరోగా నటించాడు. అయితే సిద్ధార్థ్ కెరీర్ ని మలుపు తిప్పింది తెలుగు సినిమాలనే చెప్పాలి. నృత్యదర్శకుడు నటుడు ప్రభుదేవా దర్శకుడిగా మారి తీసిన ఫస్ట్ మూవీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో హీరోగా నటించిన సిద్ధార్థ్ ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ సినిమాలో సంతోష్ గా మూవీ లవర్స్ కి బాగా నచ్చేసాడు.

బొమ్మరిల్లు సిద్ధార్థ్ గా ఫేమస్..

అయితే హీరో సిద్ధార్థ్ బొమ్మరిల్లు సిద్ధార్థ్ గా ఓ రేంజ్ లో ఫేమస్ అయ్యాడని చెప్పాలి. ఈ సినిమాతో సిద్ధూ టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పక్కింటి కుర్రాడు, మంచి డీసెంట్ అబ్బాయి అనిపించే పాత్రలో నటించిన సిద్ధూ నటనాపరంగానూ కట్టి పడేసాడు. తండ్రి చేతుల్లో పాతికేళ్ళు పెరిగి అప్పటికి ఆయన బాటలోనే బలవంతంగా సాగే ఈ తరం కుర్రాళ్ళ బాధని తన పాత్రతో అద్భుతంగా చూపించాడు సిద్ధార్థ్. ఇక ఆ క్లైమాక్స్ అయితే ఇప్పటికీ ఎంతో బాగుంటుంది. ఆ రోజుల్లోనే స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమా. ఈ సినిమాతో సిద్ధార్థ్ కాస్తా బొమ్మరిల్లు సిద్ధార్థ్ గా ఫేమస్ అయిపోయాడు. ఇక టాలీవుడ్ లో వరుసగా ఆట, ఓయ్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం వంటి హిట్లతో మీడియం రేంజ్ హీరోగా ఎదిగాడు. కానీ తమిళ్ సినిమాలపై మోజుతో టాలీవుడ్ ని పక్కన బెట్టేసాడు.

- Advertisement -

కెరీర్ లో ఎత్తు పల్లాలు..

అయితే టాలీవుడ్ లో కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న టైం లో సిద్ధార్థ్ కోలీవుడ్ లో సినిమాలు చేద్దామని వెళ్లగా, అక్కడ ముందు బాగానే సినిమాలు చేసినా, ఆ తరువాత వరుస ప్లాపులతో కెరీర్ డౌన్ అయింది. అయినా మంచి ప్రయోగాత్మక సినిమాలతో ప్రేక్షకులని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇక తెలుగులో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఆడియన్స్ కూడా పట్టించుకోలేదు. ఆ తరువాత డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ ని పలకరించినా పెద్దగా పట్టించుకోలేదు. ఇక రీసెంట్ గా రెండేళ్ల కింద మహా సముద్రం సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ సినిమా నిరాశపరచడంతో టాలీవుడ్ లో కూడా ఏమి చేయలేదు. ఇక లాస్ట్ ఇయర్ చిన్నా అనే ఫీల్ గుడ్ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సిద్ధార్థ్. చాలా కలం తర్వాత ఓ మంచి సినిమాతో డీసెంట్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. అయితే తెలుగులో అంతగా ఆదరణ దక్కలేదు. అయినా తన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం సిద్ధార్థ్ కమల్ హాసన్ తో నటించిన ఇండియన్ 2 రిలీజ్ కి రెడీ అవుతుంది. మంచి కంటెంట్ ఉన్న లవ్లీ మూవీ తో ఆడియన్స్ ముందుకు వస్తే మళ్ళీ ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని అనడంలో సందేహం లేదు. మరి రాబోయే చిత్రాలతో సిద్ధార్థ్ ఎలాంటి కం బ్యాక్ ఇస్తాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు