Hanuman : పది రోజులు.. ‘పది’ రికార్డులు..

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తున్న చిన్న సినిమా “హనుమాన్”. అయితే చిన్న సినిమాగానే వచ్చినా అఖండ ప్రేక్షకాదరణ తో ఈ సంక్రాంతి విన్నర్ గా నిలవడమే గాక, ఎన్నో టాలీవుడ్ రికార్డులని క్రియేట్ చేస్తూ, పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోతుంది. ఇక హనుమాన్ రిలీజైన కేవలం పది రోజుల్లోనే 10 రకాల రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. ఆ రికార్డులను ఒక్క్కసారి గమనిస్తే…

1.హనుమాన్ రిలీజ్ అయిన పదో రోజు నాన్ రాజమౌళి రికార్డులు తెలుగు రాష్ట్రాల్లో బద్దలు కొట్టి పదో రోజు ఏకంగా 7.91 కోట్ల షేర్ వసూలు చేసింది.

2. హనుమాన్ మూవీ పదో రోజు కలెక్షన్లతో సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం సినిమాని కూడా బ్రేక్ చేసి 107.91 కోట్ల షేర్ ని క్రాస్ చేసి 150 కొట్ల మార్క్ దిశగా దూసుకుపోతుంది.

- Advertisement -

3. హనుమాన్ మూవీ 10 రోజుల్లో 201 కోట్లు వసూలు చేసి 300 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతుంది.

4. విడుదలైన పది రోజుల్లో హనుమాన్ మూవీ 200 కోట్ల క్లబ్ లో చేరడమే కాకుండా టాలీవుడ్ లో ఈ ఫీట్ సాధించిన 12వ సినిమా గా నిలిచింది.

5. టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో నటించకుండా 200 కోట్ల మార్క్ ని దాటిన ఏకైక మూవీ హనుమాన్ మూవీ.

6. టాలీవుడ్ లోనే కాదు ఈ ఇయర్ లో ఇండియా లోనే హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ గా నిలిచిన సినిమా హనుమాన్.

7. పెట్టిన బడ్జెట్ కి మూడు రెట్లు అంటే 77 కోట్ల లాభం వసూలు చేసి హనుమాన్ సినిమా మరింత లాభాల దిశగా దూసుకుపోతుంది.

8. టాలీవుడ్ లో కంటెంట్ బాగుంటే స్టార్ హీరోల సినిమాలు కూడా ఎలాంటి అడ్డంకి కావు అని నిరూపించిన సినిమా హనుమాన్.

9. 2024 లో విడుదలైన అన్ని భాషల్లో కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా హనుమాన్.

10. నైజాం లో బిజినెస్ కి నాలుగు రెట్లు వసూలు చేసి 30 కోట్ల మార్క్ క్రాస్ చేసిన సినిమా హనుమాన్..

ఇవన్నీ హనుమాన్ కేవలం 10 రోజుల్లో సాధించిన రికార్డులు.. రానున్న రోజుల్లో హనుమాన్ మూవీ 300 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు