Hanuman : పది రోజుల్లో కుంభస్థలాన్ని బద్దలు కొట్టారు…

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ బ్లాక్ బస్టర్ గా ప్రేక్షకుల చేత మెప్పు పొందుతున్న సినిమా “హనుమాన్”. పండక్కి విడుదలైన అన్ని సినిమాల్లో తక్కువ రేంజ్ ఉన్న సినిమాగా విడుదలై అన్నిటికంటే పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా హనుమాన్ చిత్రం 10 రోజులు పూర్తి చేసుకోగా, ఈ పది రోజుల్లో హనుమాన్ సినిమా ఏకంగా 107 కోట్లకి పైగా షేర్ వసూలు చేయగా, 201 కోట్ల గ్రాస్ ని వసూలు చేసి అప్రతిహతంగా ముందుకు సాగుతుంది.

హనుమాన్ రిలీజ్ అయిన పది రోజుల కలెక్షన్స్ ని ఒక్కసారి ఏరియా వారీగా గమనిస్తే అన్ని చోట్ల పెట్టుబడికి మూడు రేట్లు ఇప్పటికే వసూలు చేసేసింది. ఒక్క నైజాం లోనే 26.56 కోట్ల షేర్ సాధించగా, ఆంధ్ర ప్రదేశ్ లో 33 కోట్లకి పైగా షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 59. 51 కోట్ల షేర్, కర్ణాటక లో 9.40 కోట్ల షేర్, హిందీ వెర్షన్ రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 17.20 కోట్ల షేర్, ఓవర్సీస్ నుండి 21.80 కోట్ల షేర్ రాబట్టగా, టోటల్ వరల్డ్ వైడ్ గా 107.91 కోట్ల షేర్ 201.35 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

ఇక హనుమాన్ థియేట్రికల్ రైట్స్ కేవలం 29 కోట్లు మాత్రమే కాగా, బిజినెస్ కి మూడు రేట్ల కన్నా ఎక్కువగానే వసూలు చేసి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి మరింత దూసుకుపోతుంది. అంటే బిజినెస్ పై ఏకంగా 77 కోట్ల ప్రాఫిట్ ని పొందారు. ఇక రానున్న రోజుల్లో హనుమాన్ 300 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా ఉంది.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు