Naga Shaurya: హీరో నాగశౌర్యలో ఇలాంటి టాలెంట్ కూడా ఉందా…?

Naga Shaurya:  ప్రముఖ యంగ్ హీరో నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి ఊహలు గుసగుసలాడే అనే సినిమా ద్వారా అడుగు పెట్టాడు ఈ యంగ్ హీరో. ఇకపోతే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు నాగశౌర్య లో దాగి ఉన్న టాలెంట్ గురించి కూడా అభిమానులు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇక అదేమిటో ఇప్పుడు చూద్దాం. 1989 జనవరి 22న ఆంధ్రప్రదేశ్ ఏలూరులో జన్మించిన ఈయన మోడల్గా తన కెరీర్ ని మొదలుపెట్టారు .నాగశౌర్య సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఎన్నో కలలు కన్నారు. అందులో భాగంగానే తన కలను నెరవేర్చుకోవడానికి హైదరాబాదుకి వచ్చారు.

ఇక సినీ రంగంలో ప్రవేశించడానికి ముందు టెన్నిస్ కూడా ఆడేవారట. టెన్నిస్ ప్లేయర్ గా భారీ పాపులారిటీ కూడా దక్కించుకున్నట్లు సమాచారం. అయితే ఇండస్ట్రీలోకి రావాలన్న కోరికతో తనలో ఉన్న ఈ టాలెంట్ ను కూడా పక్కనపెట్టి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత దాదాపు 5 సంవత్సరాల పాటు అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. నట శిక్షకుడు ఎన్ జే భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్న నాగశౌర్య అవకాశాలు లేక నిరాశతో తిరిగి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోవాలనుకున్న సమయంలోనే వారాహి చలనచిత్రం ద్వారా వచ్చిన ప్రకటనను చూసి ఆ ప్రకటనలో అవసరాల శ్రీనివాస్ నిర్మిస్తున్న శృం*ర హాస్య భరిత చిత్రం ఊహలు గుసగుసలాడే సినిమా గురించి ఉంది. ఇక వెంటనే తన ప్రొఫైల్ ని పంపించాడు.

ఆశలు లేనప్పటికీ కూడా తొలి ప్రయత్నం చేయగా అందులో ముఖ్య పాత్ర కోసం ఎంపిక అయ్యాడు. నాగశౌర్య అలా ఈ చిత్రంలో పనిచేస్తున్నప్పుడే చందమామ కథలు చిత్రానికి కూడా ఎంపికయ్యాడు. ఇక ఆ చిత్రం మొదట విడుదలయ్యింది. ఊహలు గుసగుసలాడే విడుదలైన రెండు మాసాల తర్వాత కమర్షియల్ విజయాన్ని అందుకున్నాడు నాగశౌర్య. మేకర్స్ కూడా నాగశౌర్య హాస్య భరిత చిత్రాలకు సరిపోతాడని భావించి తర్వాత సినిమాలలో అవకాశాలు ఇచ్చారు. అలా మూడవ చిత్రంగా దిక్కులు చూడకు రామయ్య సినిమా చేసి ఉత్తమ నటుడిగా నిరూపించుకున్నారు. ఇక తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ ప్రస్తుతం హీరోగా చలామణి అవుతున్నారు. అయితే అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదని చెప్పాలి . అందుకే ఇప్పటి నుంచైనా కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేసి సరైన సక్సెస్ అందుకోవాలని అభిమానులు కోరుతున్నారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు