Exclusive from SSMB29: కలలో కూడా ఊహించని కాంబినేషన్ సెట్

ప్రస్తుతం సూపర్ స్టార్ ఫ్యాన్స్ దృష్టి అంతా ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ పైనే ఉంది. దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో, మహేష్ బాబు హీరోగా రూపొందనున్న సినిమా అప్డేట్స్ గురించి ఆవురావురుమంటూ ఎదురు చూస్తున్నారు. తాజాగా సినిమాకు సంబంధించిన ఎక్స్ క్లూజివ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. మరి ఆ అప్డేట్ ఏంటంటే?

మహేష్ బాబు – రాజమౌళి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్ట్ కు SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. రాజమౌళి ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించాలనే సన్నాహాల్లో ఉన్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్టు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్వయంగా ప్రకటించారు. మహేష్ బాబు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించి రోజుకో వార్త వైరల్ అవుతోంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ రూపొందనుందని, ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కోసం పలువురు సౌత్ బడా ప్రొడ్యూసర్లు చేతులు కలపబోతున్నారని అంటున్నారు. అలాగే ఓటిటీ దిగ్గజం నెట్ ఫ్లెక్స్ ఈ సినిమాకు ఎన్ని వందల కోట్లయినా పెట్టేందుకు రెడీగా ఉన్నట్టు ఇప్పటికే సందేశం పంపిందట. మరి ఈ భారీ ప్రాజెక్ట్ ఎవరి చేతిలోకి వెళ్ళబోతుంది అనే విషయం త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

- Advertisement -

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల సెలక్షన్స్ జరుగుతున్నాయి. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కాబట్టి సినిమాలో నటించే యాక్టర్స్ కూడా అదే రేంజ్ లో ఉంటారు. తాజాగా Filmify కి అందిన ఎక్స్క్లూజివ్ సమాచారం ప్రకారం SSMB 29 మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించబోయే అవకాశం ఉంది. ఇప్పటికే SSMB 29 టీం ఈ దిగ్గజ హీరోలను సంప్రదించినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

చూస్తుంటే జక్కన్న లెక్కలు ఈసారి నెక్స్ట్ లెవెల్ అనేలా ఉన్నాయనిపిస్తోంది. ఇప్పటిదాకా కేవలం టాలీవుడ్ హీరోలపైన మాత్రమే ఫోకస్ పెట్టిన రాజమౌళి ఈసారి దేశవ్యాప్తంగా ఉన్న పలు భాషల స్టార్ హీరోలను తన ప్రాజెక్ట్ లో భాగం చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. మరి ఇంకా ఈ ప్రాజెక్ట్ లో నటించే అదృష్టం ఎవరెవరిని వరిస్తుందో చూడాలి. కాగా మరోవైపు ఈ సినిమా లాంచ్ డేట్ కు సంబంధించిన వార్తలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ సినిమాను ఏప్రిల్ 9న తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది సందర్భంగా లాంచ్ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. 2026లో సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలి అంటే జక్కన్న టీం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు