HBD Naga Shaurya: స్టార్ హీరోయిన్ పై మనసు పారేసుకున్న హీరో… ఆమెతో ఎఫైర్ వార్తలు రావాలని ఏం చేశాడో తెలుసా?

HBD Naga Shaurya : యంగ్ హీరో నాగ శౌర్యకు టాలీవుడ్ లో లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. దానికి తగ్గట్టే ఆయనపై లవ్ ఎఫైర్లకు సంబంధించిన రూమర్లు కూడా కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఈ హ్యాండ్సమ్ హీరోకు ఉన్న ఫ్యాన్ బేస్ లో ఎక్కువగా అమ్మాయిలే ఉంటారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తన ఫేవరెట్ హీరో ఇతనే అని చెప్పింది అంటే నాగశౌర్య అంటే అమ్మాయిలు ఏ రేంజ్ లో పడి చస్తారో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు నాగశౌర్య పుట్టినరోజు సందర్భంగా తనకు నచ్చిన హీరోయిన్ ఎవరు? అన్న విషయం తెలుసుకుందాం.

లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నాగశౌర్యకు ఎఫైర్లు ఏమీ తక్కువ కాదు. కెరీర్ మొదట్లో ఊహలు గుసగుసలాడే అనే సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన రాశి ఖన్నాతో ప్రేమలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. అలాగే ఆ తర్వాత మెగా డాటర్ నిహారిక తోనూ ఈ యంగ్ హీరో లవ్ ట్రాక్ నడిపాడు అంటూ రూమర్లు చక్కర్లు కొట్టాయి. నాగశౌర్య, నిహారిక ఇద్దరు కలిసి “ఒక మనసు” అనే సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జోరుగా సాగింది.

అంతేకాకుండా ఆ తర్వాత నాగశౌర్య బ్లాక్ బస్టర్ మూవీ “ఛలో” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ గెస్ట్ గా హాజరు కావడంతో, వీరిద్దరి పెళ్లికి మెగా కాంపౌండ్ ఆశీర్వాదం కూడా లభించింది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత అవన్నీ రూమర్స్ అని నాగశౌర్య కొట్టిపారేశారు. నాగశౌర్య అనూష అనే అమ్మాయిని 2022లో పెళ్లి చేసుకుని ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టారు. అయితే ఇన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో పని చేస్తున్న నాగశౌర్యకు ఒకే ఒక్క హీరోయిన్ అంటే బాగా ఇష్టమట.

- Advertisement -

గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగశౌర్యకు తన ఎఫైర్ గురించిన ప్రశ్నలు ఎదురవ్వగా, అందరు హీరోయిన్లతో ఎఫైర్ ఉందని రాస్తున్నారనీ, కానీ తనకు ఇష్టమైన హీరోయిన్ తో ఎఫైర్ ఉందనే వార్తలు మాత్రం రావట్లేదు అంటూ చమత్కరించాడు ఈ హీరో. అదే సందర్భంలో తనకు సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి అంటే చాలా ఇష్టమని, ఆమెతో ఎఫైర్ అని వార్తలు ఎప్పుడు రాస్తారో అంటూ జోకు వేశారు. కానీ మొత్తానికి తనకు అనుష్క అంటే ఇష్టం అనే విషయాన్ని మాత్రం స్వయంగా బయట పెట్టేశాడు నాగశౌర్య.

కాగా గత కొంతకాలంగా ఈ హీరోకు సినిమా ఇండస్ట్రీలో కాలం కలిసి రావట్లేదు. ఆయన నటించిన గత నాలుగైదు సినిమాలు భారీ డిజాస్టర్లు గా నిలిచాయి. లక్ష్య, కృష్ణ బృందా విహారి, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, రంగ బలి అనే సినిమాల ఫలితాలు ఈ హీరోను పూర్తిగా నిరాశపరిచాయి. ప్రస్తుతం నాగశౌర్య చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. మరి ఆ సినిమాలతోనైనా ఈ హీరో హిట్ అందుకోవాలని నాగశౌర్య పుట్టినరోజు సందర్భంగా కోరుకుందాం.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు