నయనతార ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేసిన “కొలమావ్ కోకిల” చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తమిళ్ చిత్రం తెలుగులో కో కో కోకిల లాగా డబ్ అయింది. కొలమావ్ కోకిల చిత్రాన్ని ఇప్పుడు హిందీలో
“గుడ్ లక్ జెర్రీ” గా తెరకెక్కించారు. జాన్వీ కపూర్ కథానాయికగా ఈ చిత్రానికి సిద్ధార్థ్ సేన్‌గుప్తా దర్శకత్వం వహించారు. రీసెంట్ గా ‘గుడ్ లక్ జెర్రీ’ సినిమా ట్రైలర్ విడుదల చేసింది మూవీ టీం.
రీసెంట్ గా రిలీజైన “గుడ్ లక్ జెర్రీ” ట్రైలర్ చూస్తుంటే
పర్ఫెక్ట్ గా రీమేక్ చేసినట్లు అనిపిస్తుంది. నయనతార లో నెల్సన్ చూపించిన ఇనోసెన్స్ ను జాన్వీ లో కూడా చూపించగలిగాడు దర్శకుడు సిద్ధార్ధ్ అని అర్ధమవుతుంది. ‘గుడ్ లక్ జెర్రీ’ షూటింగ్ పంజాబ్‌లో జరిగింది. జాన్వీ కపూర్ నటించిన ‘మిలి’ సినిమా కూడా పూర్తయింది. జాన్వీ కపూర్ స్వయంగా మిలి పూర్తి చేసిన విషయాన్ని తెలియజేసింది. మిలి చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు.
“గుడ్ లక్ జెర్రీ” జూలై 29న డైరెక్ట్ OTT రిలీజ్‌గా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.రంగరాజన్ రామభద్ర ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. ఈ చిత్రంలో దీపక్, మితా వశిష్ఠ్, నీరజ్ సూద్, నిశాంత్ సింగ్, సాహిల్ మెహతా తదితరులు నటించారు.