Fan Wars: TFI బాగుండాలి

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి హీరోకి వారికంటూ కొంతమంది సొంత అభిమానులు ఉండటం సహజమే. కానీ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక హీరో తమకు ఇష్టమైనప్పుడు ఆ హీరో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ చూడటం వరకు ఓకే. వేరే హీరో రెస్పెక్ట్ చేయకపోయినా పర్లేదు గాని, అవతలి హీరోని డిగ్రేడ్ చేయకూడదు. ఈ మధ్యకాలం ఇతర హీరోలను డిగ్రేడ్ చేయడం మరీ ఎక్కువైపోయింది.

రీసెంట్ టైమ్స్ లో యూత్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయ సినిమా ఎల్లలు దాటి ముందుకెళ్తున్న ఈ తరుణంలో ఇంకా ఫ్యాన్ వార్స్ అంటూ కొట్టుకు చస్తున్నారు. ఈ ఫ్యాన్ వార్స్ అనేవి ఇప్పటి నుంచి ఉన్నాయి కాదు ఎప్పటి నుంచో వస్తున్నవి. అసలు ఈ ఫ్యాన్ అనేవాళ్ళు కొందరు టాలెంట్ ని బట్టి అవుతారు ఇంకొందరు కులాన్ని బట్టి కూడా అవుతారు అనడంలో ఆశ్చర్యం లేదు.

ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ స్టార్ హీరోస్ లో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ అంతకుముందు తరంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి హీరోల ఫ్యాన్స్ మధ్య కొద్దిపాటి వివాదాలు వచ్చేవి. కానీ, అప్పట్లో ఫ్యాన్ వార్స్ అనేవి జరిగేవి కాదు. ఒకరిపై ఒకరు పోటీగా, ఇంకొందరు సెటైరికల్ గా సినిమాలు తీస్తూ ఉండేవారు.

- Advertisement -

కానీ తర్వాత కాలంలో ఫ్యాన్ వార్స్ లో కొద్దిపాటి మార్పు వచ్చింది. ఏ సినిమా ఎన్ని సెంటర్లో, ఎన్ని రోజులు ఆడింది. ఎంత కలెక్ట్ చేసింది అనేటట్లు డిస్కషన్స్ జరిగేవి. కానీ రీసెంట్ టైమ్స్ లో ఫ్యాన్ వార్స్ కూడా చాలా దారుణంగా తయారయ్యాయని చెప్పొచ్చు. అవతల హీరోని డి గ్రేడ్ చేయడంతో పాటు ఆయా హీరోల వ్యక్తిగత విషయాలను కూడా చర్చల్లోకి తీసుకొస్తున్నారు.

ఇకపోతే ఇప్పుడున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ హీరోలు మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్నారు. ఒక హీరో అంటే ఒక హీరోకి మధ్య మంచి స్నేహబంధం ఉంది. కానీ ఇవి అభిమానులకి అర్థం కావట్లేదు. ఇకపోతే ఇదివరకే ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి వాళ్ళు కూడా “మేం మేం బాగానే ఉంటాము. మీరే బాగుండాలి” అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కొంతమంది మాత్రం తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అని ఇంకా కొట్టుకు చస్తున్నారు.

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ గొడవలు ఇంకాస్త ఎక్కువైపోయాయి. ప్లేస్ చెప్పి డైరెక్ట్ గా అక్కడికి వచ్చి కొట్టుకోవడాలు కూడా మొదలయ్యాయి. ఇకపోతే వీటి గురించి హీరోలు ఎప్పటినుంచో అందరి అభిమానులు కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్తూ వస్తున్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా అందరి అభిమానులు కూడా తమకి ఇష్టమే అంటూ చెప్పుకొచ్చి, అందరి అభిమానుల్ని పబ్లిక్ గా గౌరవించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇకపోతే రీసెంట్ గా బెంగళూరులో ప్రభాస్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ జరిగినట్లుగా నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతోంది. వీడియో ప్రకారం.. మైదానంలో క్రికెట్ ఆడుతుండగా అల్లు అర్జున్, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభాస్ అభిమానిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుతున్నారు.

కానీ నిజంగా సినిమాలను ప్రేమించే సినిమా ప్రేక్షకులు మాత్రం ఈ హీరోకి ఫ్యాన్ అని కాకుండా, ప్రతి శుక్రవారం ఫస్ట్ డే ఫస్ట్ షో కి సినిమాకి వెళ్తుంటారు. వాళ్ళు మాత్రం ఎప్పుడూ టిఎఫ్ఐ బాగుండాలని కోరుకుంటారు. తెలుగు సినిమా కోసం నేడు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుందంటే అది మనం సాధించిన ఘనత అని చెప్పొచ్చు. ఈ తరుణంలో మనం మనం కొట్టుకోకుండా మనందరం కలిసి ఉంటే కుంభస్థలాన్ని బద్దలు కొట్టొచ్చు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు